'చుక్కలాంటి విమలా చక్కనైన తరుణ్'
లవర్ బాయ్ తరుణ్ హీరోగా, విమలా రామన్ హీరోయిన్ గా కన్మణి దర్శకత్వంలో సుప్రీమ్ ఆడియోస్ అధినేత రాజు హిర్వాని నిర్మిస్తోన్న చిత్రానికి 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. తొలుత వియన్ ఆదిత్య దర్శకుడిగా సినిమాని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత నిర్మాతకి, దర్శకుడికి మధ్య తలెత్తిన విభేదాల వల్ల ఆయన్ని తొలగించి కన్మణిని దర్శకుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
కన్మణి ఇంతకు ముందు నా ఊపిరి, చిన్నోడు, కాల్ సెంటర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో తరుణ్ ఓ పాట పాడటం, విమలా రామన్ బికినీలో దర్శనమివ్వడం హైలైట్. ఇటీవలే బ్యాంకాక్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలోని యువతీయువకుల మనోభావాలకు, జీవనశైలికి ఈ సినిమా అద్దం పడుతుందని నిర్మాత రాజు హిర్వానీ తెలిపారు. ఈ సినిమాకు సమర్పణ: ప్రణవ్ స్టూడియోస్, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, పాటలు: రెహ్మాన్, చిన్నిచరణ్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: గౌతంరాజు.


Click it and Unblock the Notifications











