ప్లాపు సినిమాలు తరుణ్‌ను విలన్‌‍గా మారుస్తున్నాయా?

By Bojja Kumar

హైదరాబాద్: బాల నటుడిగా ఉన్నప్పుడే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే హిట్ కొట్టి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ యువ హీరో అనతి కాలంలోనే యూత్ ఐకాన్ గా మారి పోయాడు.

అయితే వరుస ప్లాపులు తరుణ్ కెరీర్‌ను మసక బారిపోయేలా చేసాయి. టాప్ దర్శకులతో చేసినా, టాప్ హీరోయిన్లతో రొమాన్స్ పండించినా తరుణ్‌కు అస్సలు కలిసి రాలేదు. దీంతో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. చివరకి తరుణ్‌తో సినిమా చేస్తే నష్టాలే అనే స్థాయికి దిగజారింది పరిస్థితి.

హీరోగా తనకు కలిసి రావడం లేదనే విషయం గ్రహించిన తరుణ్ రూటు మార్చుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. హీరో అవకాశాలతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు పాత్రలు, విలన్ మార్కు నటనతో కూడా ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు తాను ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపినట్లు సమాచారం. ప్లాపు హీరోలుగా పేరు తెచ్చుకున్న రాణా దగ్గుబాటి, నవదీన్ విలన్ పాత్రల వైపు మళ్లిన సంగతి తెలిసిందే. వాళ్ల బాటలోనే తానూ నడవాలని చూస్తున్నాడు తరుణ్.

తరుణ్ ప్రస్తుతం 'యుద్ధం' అనే సినిమాలో చేస్తున్నాడు. శ్రీహరి, తరుణ్, యామి కాంబినేషన్‌లో రూపొందుతోంది ఈ చిత్రం. భారతీ గణేశ్ దర్శకత్వం వహిస్తుండగా, విశాఖ టాకీస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నట్టి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో ఈ చిత్రం రూపొందుతోంది.

అయితే ఇటీవల సిసిఎల్ టోర్నీ సందర్బంగా తరుణ్‌కి, నిర్మాత నట్టి కుమార్ కు మధ్య వివాదం ఏర్పడింది. తరుణ్ పై నిర్మాత నట్టి కుమార్ యాక్టర్ సంఘంలో కేసు కూడా వేసారు. 'యుద్ధం' చిత్రంలో నటిస్తున్న తరుణ్ సినిమా షూటింగు కంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడేందుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండటం, సిసిఎల్ టోర్నీ పూర్తయ్యే వరకు సినిమా షూటింగుకు రాను అని మోరాయించడంతో నట్టి కుమార్ ఈ కేసు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందనే వివరాలు తెలియరాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X