మళ్లీ హీరోగా వచ్చే ఉద్దేశ్యమే లేదా?.. ‘నువ్వే కావాలి’ 20 ఏళ్ల సెలెబ్రేషన్స్‌లో షాకింగ్‌గా తరుణ్!

ఓ రీమేక్ సినిమా క్లాసిక్‌లా మారడం, ఒరిజినల్ కంటే పెద్ద హిట్ అవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. మళయాలంలో వచ్చిన నీరం సినిమాకు తెలుగు రీమేక్ నువ్వే కావాలి. ఈ చిత్రం విడుదలై ఇరవై యేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ గ్రాండ్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఎందుకంటే తరుణ్‌ను హీరోగా నిలబెట్టిందే నువ్వే కావాలి. అయితే ఈ మూవీ హిట్ అవ్వడంలో కీలక పాత్ర వహించింది మాత్రం త్రివిక్రమ్, విజయ భాస్కర్.

అలా సరదాగా తీశాం..

అలా సరదాగా తీశాం..

నువ్వే కావాలి విడుదలై 20 యేళ్లు అవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. భయం లేకుండా తీసిన సినిమా అది. అందుకే చాలా స్థిరంగా ఉంటుంది. టెక్నికల్‌గా ఏదో నిరూపించాలనే ఆలోచన లేకుండా స్వేచ్ఛగా తీశాం. తప్పకుండా ఆడాలి, ఆడకపోతే ఏం అవుతుందో.. అనే భయాలు లేవు అంటూ చెప్పుకొచ్చాడు.

హీరోగా గ్రాండ్ ఎంట్రీ..

హీరోగా గ్రాండ్ ఎంట్రీ..

తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే హీరోగా నువ్వే కావాలి వంటి ఎమోషన్స్‌తో కూడిన చిత్రాన్ని చేశాడు. ఇక నటనలో తరుణ్ లీనమవ్వడం, సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఒకే ఒక్క సినిమాతో స్టార్డం వచ్చేసింది.

లవర్ బాయ్ ఇమేజ్..

లవర్ బాయ్ ఇమేజ్..

తరుణ్‌కు నువ్వే కావాలి చిత్రంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి లవ్ స్టోరీలతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే కాలం మారుతోంది.. వారసత్వ హీరోలు వస్తున్నారు.. కొత్త హీరోల ధాటికి, పోటికి నిలవలేకపోయాడు తరుణ్.

ఒక్క సక్సెస్..

ఒక్క సక్సెస్..

తరుణ్ ఒక్క సక్సెస్ గత కొన్నేళ్లుగా యుద్దమే చేస్తున్నాడు. చివరగా నవ వసంతం అనే ఓ చిత్రం ఓ మోస్తరుగా పర్వాలేదనిపించిందంతే. చివరగా ఇది నా లవ్ స్టోరీ అనే చిత్రంతో పలకరించాడు కానీ ఎవ్వరూ వినిపించుకోలేదు. అయితే తాజాగా తరుణ్ ఫోటోలు బయటకు వచ్చాయి.

Recommended Video

Hero Raj Tarun Talks About Co-Stars In Orey Bujjiga Movie
నువ్వే కావాలి సెలెబ్రేషన్స్..

నువ్వే కావాలి సెలెబ్రేషన్స్..

నువ్వే కావాలి విడుదలై ఇరవై యేళ్లు అవుతున్న సందర్భంగా తరుణ్ ఇంట్లోనే సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకల్లో తరుణ్ లుక్ బయటకు వచ్చింది. మీసాలు లేకుండా చాక్లెట్ బాయ్‌లానే ఉన్నాడు కానీ మొహం ఒకప్పటిలా లేదు. తరుణ్ కూడా కాస్త లావైనట్టే కనిపిస్తోంది. చూస్తుంటే తరుణ్ ఇకపై హీరోగా సినిమాలు చేసే ఉద్దేశ్యమే లేనట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X