twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తరుణ్‌, శ్రీహరి మధ్య యుద్ధం మొదలైంది

    By Srikanya
    |

    తరుణ్‌, శ్రీహరి కాంబినేషన్ లో 'యుద్ధం'... ఫైట్‌ ఈజ్‌ ది రైట్‌ (ట్యాగ్ లైన్) చిత్రం మొదలైంది. నిర్మాత నట్టికుమార్‌ విశాఖటాకీస్ ‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్‌ భారతి గణేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన దాసరి మాట్లాడుతూ...నట్టికుమార్‌ చిన్నతనం నుంచి నా వద్దనే ఉండి నిర్మాతగా మారి అరవై సినిమాలు తీశాడు. డిస్ట్రిబ్యూటర్‌ గా, ఎగ్జిబిటర్ ‌గా ఎదిగాడు. స్వయంకృషితో పైకి వచ్చాడు. టైటిల్‌ బాగుంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

    నిర్మాత నట్టికుమార్‌ మాట్లాడుతూ..మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం. ఏప్రిల్‌ లో 300 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం" అన్నారు. యామి అనే భామ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆశిష్‌ విద్యార్ధి, అలీ, వేణుమాధవ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి మాటలు: సుధాకర్‌ వంతరాయ, సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: యశ్వంత్‌, కళ: కె.వి.రమణ, అలంకరణ: భాస్కర్‌ రెడ్డి, దుస్తులు: బాబూరావు, సహ-దర్శకుడు: రామారావు శీతిరాల, పోరాటాలు: విజయ్‌, సహనిర్మాతలు: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుందర్‌.ఆర్‌, నిర్మాత: నట్టికుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భారతీ గణేష్‌

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X