Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తరుణ్, శ్రీహరి మధ్య యుద్ధం మొదలైంది
తరుణ్, శ్రీహరి కాంబినేషన్ లో 'యుద్ధం'... ఫైట్ ఈజ్ ది రైట్ (ట్యాగ్ లైన్) చిత్రం మొదలైంది. నిర్మాత నట్టికుమార్ విశాఖటాకీస్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ భారతి గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన దాసరి మాట్లాడుతూ...నట్టికుమార్ చిన్నతనం నుంచి నా వద్దనే ఉండి నిర్మాతగా మారి అరవై సినిమాలు తీశాడు. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా ఎదిగాడు. స్వయంకృషితో పైకి వచ్చాడు. టైటిల్ బాగుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ..మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం. ఏప్రిల్ లో 300 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం" అన్నారు. యామి అనే భామ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆశిష్ విద్యార్ధి, అలీ, వేణుమాధవ్, రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: సుధాకర్ వంతరాయ, సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: యశ్వంత్, కళ: కె.వి.రమణ, అలంకరణ: భాస్కర్ రెడ్డి, దుస్తులు: బాబూరావు, సహ-దర్శకుడు: రామారావు శీతిరాల, పోరాటాలు: విజయ్, సహనిర్మాతలు: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుందర్.ఆర్, నిర్మాత: నట్టికుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భారతీ గణేష్