twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడు గెటప్స్‌లో తరుణ్.. నువ్వే కావాలి రేంజ్‌లో ఇది నా లవ్‌స్టోరి

    By Rajababu
    |

    Recommended Video

    ట్రిపుల్‌ రోల్‌ లో తరుణ్.. 'ఇది నా లవ్‌స్టోరి'

    రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై తరుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ఇది నా లవ్‌స్టోరీ'. రమేష్‌ గోపీ దర్శకులు. ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మాత. హీరో తరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా.. హీరో తరుణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. అనంత‌రం త‌రుణ్ పుట్టిన‌రోజును కేక్ క‌టింగ్‌తో చిత్ర‌యూనిట్ సెల‌బ్రేట్ చేసింది.

    సినిమాలో తరుణ్ నటన

    సినిమాలో తరుణ్ నటన

    ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత ఎస్‌.వి.ప్రకాష్‌ మాట్లాడుతూ - ''హీరో తరుణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా కోసం వర్క్‌ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు.

    రెగ్యులర్ ప్రేమకథ కాదు..

    రెగ్యులర్ ప్రేమకథ కాదు..

    హీరో తరుణ్‌ మాట్లాడుతూ - ''నాపుట్టినరోజు సందర్భంగా ట్రైలర్‌ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. నాగార్జునగారు టీజర్‌ను విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. టీజర్‌ పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. రెగ్యులర్‌ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో నేను కనపడ‌తాను. మ‌రి ఇందులో ట్రిపుల్‌ రోల్‌ చేశానా? లేదా మూడు షేడ్స్‌ ఉన్న పాత్ర చేశానా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    గ్లామర్‌గా ఓవియా

    గ్లామర్‌గా ఓవియా

    డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇలా అన్ని చక్కగా అమరాయి. హీరోయిన్‌ ఓవియా చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు కూడా కనపడవు. గోగినేని బాలకృష్ణగారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. అలాగే ట్రెండీ మూవీస్‌ సంస్థ సినిమాను యు.ఎస్‌లో విడుదల చేస్తుంది అని తరుణ్ అన్నారు.

    మ్యూజిక్ చక్కగా కుదిరింది..

    మ్యూజిక్ చక్కగా కుదిరింది..

    మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌ విజయ్‌ మాట్లాడుతూ - ''తెలుగులో నా తొలి చిత్రమిది. సినిమాకు మంచి సంగీతం, రీరికార్డింగ్‌ కుదిరింది. మంచి సినిమాకు పనిచేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

    ఫిబ్రవరి 14న విడుదల

    డైరెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ - ''తరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మనసున్న మనుషులందరికీ ఫిబ్రవరి 14న విడుదలయ్యే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తరుణ్‌ గత హిట్‌ చిత్రాలు 'నువ్వే కావాలి', 'నువ్వే నువ్వే' కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. లవర్స్‌కు మంచి ట్రీట్‌ అవుతుందని గర్వంగా చెప్పగలను'' అన్నారు.

    టీజర్‌కు మంచి రెస్పాన్స్

    టీజర్‌కు మంచి రెస్పాన్స్

    దర్శకుడు గోపి మాట్లాడుతూ - ''నాగార్జునగారు విడుదల చేసిన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు టీజర్‌కి కూడా అలాంటి రెస్పాన్సే వస్తుందని భావిస్తున్నాను. అంజలి, నువ్వేకావాలి కంటే ఈ సినిమా తరుణ్‌కి పెద్ద హిట్‌గా నిలుస్తుంది. సినిమాను చూసే ప్రేక్షకుడు ఇది నా లవ్‌స్టోరీ అని తప్పకుండా ఫీల్‌ అవుతాడు'' అన్నారు.

    English summary
    Idi Naa Love Story is an upcoming 2018 Telugu romantic film, produced by Prakash SV, starring Tarun and Oviya. The film is a remake of the 2013 hit Kannada film, Simple Agi Ondh Love Story. This movie's audio released on January 8th at Prasad labs on the eve of Tarun's birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X