తరుణ్ ఫ్రెండంతే: ప్రియమణి

By Staff

నయనతార-ప్రభుదేవా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ ఈమధ్య వచ్చిన వదంతులు సర్దుమణగక మునుపే ఇప్పుడు ప్రియమణి-తరుణ్ గురించిన వదంతులు బలంగా ప్రచారమవుతున్నాయి. లవర్ బాయ్ గా పేరున్న తరుణ్ ను ప్రియమణి పెళ్లి చేసుకోనుందనే ప్రచారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి చెన్నై వరకూ కూడా పాకింది. 'నవవసంతం' సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించినప్పటి నుంచి వీరు మంచి స్నేహితులుగా మారాననీ, తరచు పబ్లిక్ ప్లేస్ లలో కనిపిస్తూ తమ స్నేహాన్ని కొత్త మలుపు తిప్పే ఆలోచనలో ఉన్నారనీ ఆ వార్తల సారాంశం. ప్రియమణికి ప్రేమ కానుకగా 'టయోటా ఇన్నోవా' ను తరుణ్ బహూకరించారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం జరిగినప్పుడల్లా క్విక్ రియాక్షన్ ఇచ్చే ప్రియమణి ఈసారి కూడా వెంటనే స్పందించింది. ఇవన్నీ ఉత్త వదంతులేననీ, ఎంతమాత్రం నిజం లేదనీ తేల్చిచెప్పింది.

'ప్రేమ...పెళ్లి వార్తలన్నీ కట్టుకథలే. తరుణ్ నాకు మంచి ఫ్రెండ్ అంతే. అంతకుమించి మామధ్య ఏమీ లేదు' అంటూ ప్రియమణి సమధానమిచ్చింది. తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్ములతోనే 'టయోటా ఇన్నోవా' కొనుక్కున్నానని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కెరీర్ పైనే తన దృష్టి ఉందనీ, తెలుగు, తమిళ తదితర భాషా చిత్రాలతో పాటు మణిరత్నం 'రావణ్' చిత్రం ద్వారా హిందీలోకి కూడా అడుగుపెడుతున్నాననీ తెలిపింది. తమిళంలో 'నెనైత్తాలై ఇనుక్కం', తెలుగులో జగపతిబాబు సరసన 'ప్రవరాఖ్యుడు', రవితేజతో బెల్లంకొండ సురేష్ తీస్తున్న 'నాడోడిగళ్' రీమేక్ లోనూ ప్రియమణి ప్రస్తుతం నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X