స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్.. ఆ డబ్బుతోనే శంభో శంకర చిత్ర నిర్మాణం!
Recommended Video

టాలీవుడ్ లో రోజుకొక చీకటి కోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా తిరుపతిలో వెలుగులోకి వచ్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొంతమంది టాలీవుడ్ వర్థమాన నటులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియన్ హరి ఈ కేసులో అరెస్టు కావడం సంచలనం రేపుతోంది. చిత్తూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

స్మగ్లర్లతో సంబంధాలు
హరి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిన్ననే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేడు పోలీసులు హరి పేరు వెల్లడించారు.

స్మగ్లింగ్ తో కోట్లు
హరి స్మగ్లింగ్ తో కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ లో హరి బాగా పాలుపర్ అయ్యాడు. మరి కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు.

ఆ డబ్బుతోనే
స్మగ్లింగ్ తో సంపాదించిన డబ్బుతోనే తన సహచర నటుడు నటించిన శంభో శంకర చిత్రానికి ఫైనాన్స్ చేసినట్లు పోలీసులు విచారణ తేల్చినట్లు తెలుస్తోంది. హరిపై ఇప్పటికే 20 కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

టాస్క్ ఫోర్స్ బృందం
ఈ కేసుని టాక్స్ ఫోర్స్ పోలీస్ లు విచారణ చేస్తున్నారు. హరితోపాటు ఇంకెవరైనా సినీ నటులకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











