ఆర్థిక నేరస్థుడితో సుస్మిత సేన్‌కు పెళ్లి అవసరమా? లలిత్ మోడీపై తస్లీమా నస్రీన్ ఘాటైన స్పందన
బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్, లలిత్ మోడీ డేటింగ్ వ్యవహారం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు రకరకాల వ్యక్తులతో డేటింగ్ చేసిన సుస్మితా సేన్ తాజాగా వివాదాస్పద సెలబ్రిటీ, ఐపీఎల్ మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో రిలేషన్‌షిప్ పెట్టుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే సుస్మితా, లలిత్ మోడీ వ్యవహారంపై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ఘాటుగా స్పందించారు. సుస్మితా గురించి తస్లీమా నస్రీన్ ఏమన్నారంటే..

సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ డేటింగ్ వ్యవహారం
లలిత్ మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. ఇప్పడే లండన్‌కు వచ్చాను. మాల్దీవ్స్, సర్దానియా లాంటి ప్రదేశాలను సుస్మితా సేన్‌తో కలిసి గ్లోబల్ టూర్‌గా చుట్టు ముట్టి వచ్చాం. చివరకు నా లైఫ్‌లో కొత్త బిగినింగ్. చంద్రుడిపైకి ఎగిరినంత ఆనందంగా ఉంది. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇస్తున్నాను. జస్ట్ డేటింగ్ చేస్తున్నాను. పెళ్లి కూడా ఏదో ఒకరోజు జరగడం ఖాయం అని లలిత్ మోడీ తన ట్వీట్‌పేర్కొన్నాడు. లలిత్ మోడీ పోస్టుకు సమాధానం ఇస్తూ.. ఇంకా పెళ్లి కాలేదు. ఉంగరాలు మార్చుకోలేదు. షరతుల్లేకుండా మా ప్రేమ ఏర్పడింది. ఈ వివరణ చాలు అనుకొంటాను అని సుస్మితా సేన్ తన పోస్టులో పెట్టింది.

కళ్లు తిప్పుకొనే అందం ఆమె సొంతం
సుస్మిత గురించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి.. నాకు సుస్మితా సేన్‌తో మంచి అనుబంధం ఉంది. నేను ఒకసారి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో కలిశాను. నన్ను చూడగానే వచ్చి కౌగిలించుకొని.. మీరు అంటే నాకు చెప్పలేనంత ప్రేమ అని అన్నారు. అప్పటి వరకు నేనే పొడుగ్గా ఉంటానని అనుకొన్నాను. కానీ ఆమె పక్కన నిలుచున్న తర్వాత నేనే పొట్టిదానిగా కనిపించాను. ఆమె అందాన్ని చూస్తూ.. నేను నా కళ్లను తిప్పుకోలేకపోయాను అని తస్లీమా నస్రీన్ అన్నారు.

సుస్మితా సేన్‌ది గొప్ప వ్యక్తిత్వం
సుస్మితా సేన్ గురించి తస్లీమా నస్రీన్ తన అభిప్రాయాలను పంచకొంటూ.. సుస్మిత అందమే కాదు.. ఆమె వ్యక్తిత్వమంటే నాకు చాలా ఇష్టం. యుక్త వయసులోనే ఇద్దరు చిన్నారులను కూతుళ్లుగా చేసుకొని దత్తత స్వీకరించింది. ఆమె నిజాయితీ, ధైర్యం, సమాజంపై అవగాహన, ఆత్మస్థైర్యం, అంకితభావం, ముక్కుసూటితనం నాకు బాగా నచ్చుతుంది అని తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు.

లలిత్ మోడీతో రిలేషన్‌షిపా?
సుస్మితా అంటే నాకు గొప్ప గౌరవం ఉంది. అలాంటి ఉన్నత భావాలు కలిగిన సుస్మిత.. లలిత్ మోడీతో రిలేషన్‌షిప్ పెట్టుకొన్నదనే విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. వివిధ నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నది. కేవలం సంపన్నుడనే కారణంతో బంధం పెట్టుకొన్నదా? ఒకవేళ నిజంగానే అతడితో ప్రేమలో పడిందా? నా ఉద్దేశంలో ఆమె ప్రేమలో పడిందని అనుకొను. ఎవరైనా డబ్బుపై మోజుపడి ప్రేమలో పడితే.. వారిపై ఉండే గౌరవం పోతుంది అని తస్లీమా నస్రీన్ అభిప్రాయపడింది.

అతడితో పెళ్లి అవసరం లేదంటూ
సుస్మితా సేన్ ఎవరిపై ఆధారపడి ఉండకుండా ఉండే మహిళ. ఆత్మస్థైర్యం ఎక్కువ. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ. అలాంటి వ్యక్తి విలువలు లేని వ్యక్తిని పెళ్లి చేసుకొంటుందా? ఆమె అతడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదనేది బలంగా నా అభిప్రాయాన్ని చెబుతున్నాను అని తస్లీమా నస్రీన్ అన్నారు.


Click it and Unblock the Notifications











