twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరణ్ ఎంగేజ్ మెంట్ కి ఘుమఘుమలాడే ఇండియన్, కాంటినెంటల్ రుచులు..!

    By Sindhu
    |

    రామ్ చరణ్, ఉపాసనల వివాహ నిశ్చితార్ధ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హైదరాబాదు శివారు హిమాయత్ సాగర్ సమీపంలోని కామినేని కుటుంబానికి చెందిన 'టెంపుల్ ట్రీస్' ఫామ్ హౌస్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా ఈ రాత్రి జరుగనుంది. డిల్లీకి చెందిన 'ఛాయిస్ ఎంటర్ టైన్మెంట్' ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు ఈ వేడుక నిర్వహణ బాధ్యతను కామినేని ఫ్యామిలీ అప్పగించింది. ఈ కార్యక్రమం కోసం రమణీయమైన సెట్ ను రూపొందించారు. అద్భుతంగా వేసిన ఈ సెట్ కు రకరకాల ఫ్లవర్స్ మరింత శోభనిస్తున్నాయి. ప్రపంచంలోనే కాస్ట్ లీ ఫ్లవర్స్ గా పేరుగాంచిన ఫ్లవర్స్ ను ప్రత్యేకంగా థాయిలాండ్ నుంచి తెప్పించినట్టు తెలుస్తోంది. అలాగే ఎంతో అనుభవమున్న డెకోరేటర్స్ ను కూడా అక్కడి నుంచే రప్పించారు.

    ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో సెట్ డిజైనింగ్ జరిగింది. వేదిక ప్రాంగణం పచ్చదనంతో కూడి ఉండడంతో ఆ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేయడానికి అందుకు తగ్గా థీం లైట్స్ ను ఎరేంజ్ చేస్తున్నారు. దీంతో రాత్రి వేళ ఆ వాతావరం కన్నుల పండువగా ఉంటుందని అంటున్నారు. ఈ ఆనంద క్షణాలను తీపి గుర్తుగా తమ కెమెరాలలో బంధించడానికి పేరెన్నికగన్న ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను ఎంగేజ్ చేశారు. ఇక రామ్ చరణ్ ఈ వేడుకలో ధరించే షేర్వాణీని ప్రముఖ డిజైనర్ రాజేష్ ప్రతాప్ సింగ్ కొన్ని లక్షల ఖర్చుతో డిజైన్ చేశాడట. ఇక విందు భోజనం ఏర్పాట్లు పసందుగా జరుగుతున్నాయట. ఘుమఘుమలాడే ఇండియన్, కాంటినెంటల్ రుచులన్నీ రెడీ అవుతున్నాయి!

    English summary
    Ram Charan Tej and Upasana Kamineni will be getting engaged today at venue : Temple Trees, the Kamineni family’s farm house near Himayathsagar. The engagement event starts tonight at 7PM and will be covered live ! by tv channels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X