»   » రామ్‌చరణ్‌ను కలవాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా

రామ్‌చరణ్‌ను కలవాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్‌: తమ అభిమాన హీరోని కలవాలని,కరచాలనం చెయ్యాలని,ఫోటో దిగాలని చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి ఎక్కువ మంది అభిమానులు ఉన్న హీరోల కీ ఈ రకమైన క్రేజ్ మరీ ఉంటుంది. దీన్నే టాటా డొకోమో కంపెనీ వినియోగించుకోనుంది. రామ్‌చరణ్‌ను కలుస్తారా అంటూ ఓ స్కీమ్ తో ముందుకు వస్తోంది.

  తమ కంపెనీ టారిఫ్ రీచార్జి చేసుకున్న వినియోగదారులకు తమ రెగ్యులర్ ఆఫర్స్ తో పాటు... లాటరీ ద్వారా ఎంపిక చేసిన 100 మంది కలిసే అవకాసం కల్పిస్తోంది. ఎంపిక చేయబడ్డ వినియోగదారులు హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో జరిగే కార్యక్రమాల్లో తమ ప్రచారకర్త రామ్‌ చరణ్‌ను కలిసే అవకాశం కల్పిస్తామని టాటా డొకొమో ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎస్‌.రామకృష్ణ తెలిపారు.

  ప్రస్తుతం రామ్ చరణ్ ఎవడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఎవడు' . ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా స్విజ్జర్ ల్యాండ్ జ్యూరిచ్ లో శ్రుతిహాసన్, రామ్ చరణ్ లపై ఓ పాటను చిత్రీకరించారు. అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని వస్తున్నారు. మే 29 నుంచి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమవుతోంది.

  ఈ షెడ్యూల్ జూన్ 20 వరకూ సాగుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, అమీ జాక్సన్,శృతి హాసన్ పై సీన్స్ ని చిత్రీకరిస్తారు. ఇప్పటికే చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలకానుంది. ఈ చిత్రం అభిమానులను సైతం ఓ రేంజిలో అలరించే చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ అండర్ కరంట్ గా సాగే చిత్రం అని చెప్తున్నారు.

  English summary
  Indian mobile operator Tata Docomo has launched its 'Meet and Greet Ram Charan' offer for its prepaid GSM subscribers in Andhra Pradesh. To participate in this offer, existing GSM prepay customers have to recharge for INR 222. As part of the offer, around 100 lucky winners across Andhra Pradesh will be selected through a lucky draw and get a chance to meet Tata Docomo's brand ambassador Ram Charan at Hyderabad, Vijayawada and Visakhapatnam in coming month. The offer is valid till end of June.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more