twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి సినిమా అంటూ కేసీఆర్ ప్రశంస.. పన్ను రాయితీ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ నిర్మాణంలో ప్రజ్వల సమర్పణలో సన్ టచ్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజలి పాటిల్, సిద్ధికీ, లక్ష్మీ మీనన్, రత్నశేఖర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘నా బంగారు తల్లి'. సునీత కృష్ణన్, ఎంఎస్. రాజేష్ నిర్మాతలు. రాజేష్ టచ్ రివర్ దర్శకుడు.

    ఇప్పటికే మూడూ జాతీయ అవార్డలను అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అంశంపై తెరకెక్కిన ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది.

    Tax exemption for 'Naa Bangaru Talli'

    ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...‘నా బంగారు తల్లి చిత్రాన్ని సమాజానికి మంచి అందించే ఉద్దేశ్యంతో తీసారు. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే దురాచారాన్ని వ్యతిరేకిస్తూ.... ప్రస్తుత సమాజంలో స్త్రీలకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయనేది ఈ చిత్రంలో చూపించారు అన్నారు.

    ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం హైదరాబాద్‌లో చిత్రీకరించారు, ఇటువంటి సినిమాలను ప్రొత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విడుదలకు ముందే మూడు జాతీయ, అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పన్ను రాయితీ ప్రకటిస్తున్నాం' అన్నారు.

    English summary
    Multiple national and international awards winning film, 'Naa Bangaru Talli', which has been well-received by the Telugu audiences and critics, has got a tax exemption from the Telangana government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X