విజయ్ దేవరకొండ డైరెక్టర్‌ని వణికించిన నయనతార.. ఎట్టకేలకు ఆ వివాదం గురించి!

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. టాక్సీవాలాకు చిత్రీకరణ సమయంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమా గురించి వ్యతిరేక ప్రచారం జరిగింది. పుండు మీద కారంలా పైరసీ కూడా మూడు నెలల క్రితమే లీక్ అయిపోవడంతో సినిమా దాదాపు చనిపోయిందని తాము భావించినట్లు స్వయంగా విజయ్ దేవరకొండే పలు వేదికలపై తెలిపాడు. కానీ అనూహ్యంగా టాక్సీవాలా చిత్రం తొలి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ టాక్సీవాలా షూటింగ్ సమయంలో తాను భయపడిన ఓ విషయాన్ని వెల్లడించారు.

 కాపీ అంటూ రూమర్స్

కాపీ అంటూ రూమర్స్

టాక్సీవాలా చిత్రం కాపీ అంటూ విడుదల కాక ముందు ప్రచారం జరిగింది. తమిళంలో నయనతార నటించిన డోరా చిత్ర కాన్సెప్ట్ తో టాక్సీవాలా చిత్రాన్ని రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. అప్పటికే పైరసీ లీక్ అయి సతమతమవుతున్న చిత్ర యూనిట్ కు ఇది ఒక సమస్యగా మారింది. ఏదైనా సినిమా కాపీ అని వార్తలు వస్తే చాలా ఇంతపెద్ద రచ్చగా మారుతున్నాయో గమనించాం.

నయనతార భయపెట్టేసింది

నయనతార భయపెట్టేసింది

టాక్సీవాలా చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యాక తమిళంలో నయనతార నటిస్తున్న డోరా చిత్రం కూడా దాదాపుగా ఇలాంటి కాన్సెప్ట్ తోనే రాబోతున్నట్లు తెలిసిందని రాహుల్ తెలిపాడు. డోరా చిత్ర పోస్టర్ చూసి చాలా భయపడిపోయా. కారు కాన్సెప్ట్ తోనే ఈచిత్రం కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో టాక్సీవాలా చిత్ర షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడిందని రాహుల్ తెలిపాడు.

 మొదటి షోకి వెళ్ళా

మొదటి షోకి వెళ్ళా

నా అనుమానం నివృత్తి చేసుకోవడానికి డోరా చిత్రం విడుదలయ్యాక తొలి షోనే చూశా. ఫస్టాఫ్ టాక్సీవాలతో చాలా దగ్గరగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ రెండు చిత్రాలకు ఎలాంటి పోలిక లేదని రాహుల్ తెలిపాడు. దీనితో చాలా సంతోషించానని రాహుల్ తెలిపాడు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది.

 వసూళ్ల సునామి

వసూళ్ల సునామి

ఇక టాక్సీవాలా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పోటీగా మరో బలమైన చిత్రం లేకపోవడంతో టాక్సీవాలా చిత్రం కలెక్షన్ల చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం 25 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం విశేషం. రజనీకాంత్ 2.0 చిత్రం విద్దులయ్యే వరకు టాక్సీవాలా డ్రీమ్ రన్ కొనసాగనుంది. టాక్సీవాలా చిత్రంతో విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండో విజయం అందుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X