twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాక్సీవాలా మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ: సక్సెస్ జోష్‌లో విజయ్ దేవరకొండ

    |

    నోటా సినిమా తర్వాత విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రిలీజ్‌కు ముందే పైరసీకి గురైన విచిత్ర పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ కావడం వివాదాస్పదంగా మారింది. కెరీర్‌లోనే హీరోయిజానికి తావులేని సినిమాలో విజయ్ దేవరకొండ నటించాడనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రంలో ప్రియాంకా జవాల్కర్, మాలవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే పైరసీ వెబ్‌సైట్లో హడావిడి సృష్టిస్తున్న ఈ చిత్రంలోని ప్రధాన అంశాలు మీకోసం..

    విజయ్ దేవరకొండకు సపోర్టుగా... రంగంలోకి ప్రభాస్‌, రౌడీ రిప్లై!విజయ్ దేవరకొండకు సపోర్టుగా... రంగంలోకి ప్రభాస్‌, రౌడీ రిప్లై!

    టాక్సీవాలా మూవీ కథ ఇదే

    టాక్సీవాలా మూవీ కథ ఇదే

    నిరుద్యోగి అయిన విజయ్ బతుకు తెరువు కోసం టాక్సీ డ్రైవర్‌గా మారుతాడు. తన కారు వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ చిత్రంలో ఓ ప్యాసింజర్ వల్ల అనేక సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. ఎవరా ప్యాసింజర్.. ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయనే విషయం ఈ చిత్రంలోని కీలక అంశాలని చెప్పుకొంటున్నారు.

    సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా

    సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా

    టాక్సీవాలా సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రంతో రాహుల్ సంక్రిత్యన్ తొలిసారి దర్శకుడిగా మారారు. కథ, మాటలు స్వయంగా ఆయన అందించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యారు.

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్ టాక్సీవాలాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ప్రియాంక, మాళవికతో విజయ్ కెమిస్ట్రీ కొత్తగా ఉండబోతుందని చెప్పుకొంటున్నారు. ఆద్యంతం వినోదం, సస్సెన్స్‌తో సినిమా సాగుతుందని ప్రమోషన్‌లో విజయ్ దేవరకొండ, ప్రియాంక వెల్లడించిన సంగతి తెలిసిందే.

     ప్రియాంక , మాళవిక నాయర్ యాక్టింగ్

    ప్రియాంక , మాళవిక నాయర్ యాక్టింగ్

    ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ సినిమాలోని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ముఖ్యంగా మాళవిక నాయర్ పాత్ర సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. ప్రియాంక గ్లామర్ మూవీకి యాడెడ్ ఫ్లేవర్ అని దర్శకుడు పేర్కొన్నారు.

    సాంకేతిక నిపుణుల పనితీరు

    సాంకేతిక నిపుణుల పనితీరు

    టాక్సీవాలాకు యువ జట్టు సాంకేతిక నిపుణులుగా వ్యవహారించారు. తమిళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సాయికుమార్ రెడ్డి అందించిన పంచ్ డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా మారుతాయంటున్నాను. సినిమాకు గ్రాఫిక్ వర్క్ మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పుకొంటున్నారు.

    ప్రొడక్షన్, బ్యానర్‌పై

    ప్రొడక్షన్, బ్యానర్‌పై

    టాక్సీవాలా చిత్రానికి జర్నలిస్టు ఎస్‌కేఎన్ తొలిసారి నిర్మాతగా మారారు. బన్నీవాస్, వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణ పర్యవేక్షణలో యూవీ క్రియేషన్, జీఏ2 బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నిడివి 2.10 గంటలుగా ఫిక్స్ చేశారు.

    English summary
    Vijay Deverakonda's Taxiwaala set to release on November 17th. As promotion programme, Vijay speak to Filmibeat Telugu. He revealed behind movie Shoot and pain about their hard work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X