విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ రిలీజ్ డేట్ మళ్లీ మారింది!
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. వాస్తవానికి ఈ చిత్రం 'గీత గోవిందం' కంటే ముందే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
ఈ చిత్రాన్ని నవంబర్ 16న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ మళ్లీ మారింది. ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 17న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేరవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
టాక్సీవాలాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, సైన్స్ ఫిక్షన్స్, థ్రిల్లర్, కామెడీ చాలా ఉన్నాయి. నా కెరీర్లో చేస్తున్న డిఫరెంట్ మూవీ. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను అని విజయ్ దేవరకొండ గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల, సౌండ్ - సింక్ సినిమా, స్టంట్స్ - జాషువా, ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి, లిరిక్స్ - కృష్ణ కాంత్, మ్యూజిక్ - జేక్స్ బిజాయ్, ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్, సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి, నిర్మాత - ఎస్ కె ఎన్, ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 , యువి పిక్చర్స్, స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్.


Click it and Unblock the Notifications











