హీరోయిన్లకు వేధింపులు ఉండవు:. అల్లు అర్జున్, బన్నీ టీషర్ట్ వైరల్.. ధర ఎంతంటే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడుంటే అందరి చూపులు అతడిపైనే ఉంటాయి. స్టైలీష్ లుక్స్‌తో బన్నీ సందడి చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో బన్నీ ధరించిన టీషర్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ధర గురించి చర్చించుకోవడం టాక్ ఆఫ్ ది టైన్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

బన్నీ టీషర్ట్ ధర ఎంతంటే
టాక్సీవాలా వేడుక కోసం ధరించిన టీషర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నది. ఈ టీషర్ట్ ఖరీదు అక్షరాల రూ.65 వేలకుపైనే ఉండటంతో క్రేజీగా మారింది. ప్రస్తుతం ఆ టీషర్ట్ ధరతో కూడిన ట్యాగ్‌ను, అల్లు అర్జున్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 65 వేల ధర ఉండటానికి ఏమిటి కారణమని అందరూ చర్చించుకొంటున్నారు.

జర్నలిస్టు కాదు మెగా అభిమాని
టాక్సీవాలా వేదికపై నిర్మాతగా మారిన జర్నలిస్టు ఎస్‌కేఎన్ ప్రశంసలతో అల్లు అర్జున్ ముంచెత్తాడు. తన సోదరుడు అల్లు శిరీష్ ద్వారా తనకు పరిచయమని అన్నారు. జర్నలిస్టుగా కంటే తనకు మెగా అభిమానిగా ఎక్కువ పరిచయం అన్నారు. ఏలూరు నుంచి వచ్చి జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి నిర్మాత స్థాయికి ఎదిగాడు అని అల్లుఅర్జున్ అన్నారు.

హీరోయిన్లకు వేధింపులుండవు
భారతీయ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న మీ టూపై టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లకు వేధింపులు ఉండవు. టాలీవుడ్ క్లీనెస్ట్ ఇండస్ట్రీ. హీరోయిన్లుకు అత్యంత ప్రధాన్యం ఇస్తారు. అందుకే ప్రతీ ఒక్కరు టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోతారు అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు.

ప్రియాంక తెలుగు అమ్మాయే
ఇక టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక మహారాష్ట్రలో పుటింది. కానీ అనంతపురంలో పెరిగింది. ఆమె మహారాష్ట్రకు చెందిన వారనుకొంటే తప్పే. ప్రియాంక అచ్చ తెలుగు అమ్మాయి. టాక్సీవాలాలో విజయ్ దేవరకొండతో కలిసి అదరగొట్టింది అని అల్లు అర్జున్ అన్నారు.


Click it and Unblock the Notifications











