ట్విట్టర్ రివ్యూ: 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ.. సినిమా సూపరే!

Recommended Video

Taxiwala Movie Twitter Review | Vijay | Rahul Sankrityan | FilmiBeat Telugu

సంచలన హీరో విజయ్ దేవరకొండ నెమ్మదిగా కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలతో విజయ్ దేవరకొండకు యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. గీత గోవిందంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నోటా చిత్రంతో వచ్చాడు. ఆ చిత్రం నిరాశ పరిచింది. విజయ్ ఈ ఏడాది మూడోసారి టాక్సీవాలా చిత్రంతో వస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన టాక్సీవాలా నేడు విడుదలవుతోంది. ప్రియాంక జవాల్కర్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది.హర్రర్ కథాంశంతో రాబోతున్న టాక్సీవాలాపై ట్రైలర్ తో ఆసక్తి ఏర్పడింది. సోషల్ మీడియాలో టాక్సీవాలా టాక్ ఎలా ఉందొ చూద్దాం.

ఫస్ట్ హాఫ్ సూపర్

ఫస్ట్ హాఫ్ లో ఒక పది నిమిషాలు మినహా మిగిలిన సినిమా అదిరిపోయింది. చక్కటి ప్రయత్నం చేసిన దర్శకుడిని అభినందించాల్సిందే.

గీత గోవిందం తరువాత మళ్ళీ

విజయ్ దేవరకొండ అదరగొట్టాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తరువాత టాక్సీవాలాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

విజయ్ దేవరకొండ కొట్టేశాడు

ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బావుంది. సెకండ్ హాఫ్ కూడా బావుంది. విజయ్ దేవరకొండ మరో హిట్ కొట్టేశాడు.

రొటీన్ హర్రర్

టాక్సీవాలా రొటీన్ హర్రర్ చిత్రం. యావరేజ్ గా నిలిచే అవకాశం ఉంది.

నిరాశపరిచేలా

టాక్సీవాలా చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రం పరవాలేదు.

పక్కదారి పట్టించకుండా

కథని పక్కదారి పట్టించకుండా లాజికల్ గా పట్టున్న కథనంతో నడిపించారు.

ఒకసారి చూడొచ్చు


టాక్సీవాలా చిత్రంతో విజయ్ దేవరకొండకు మరో హిట్. తప్పకుండా ఒకసారి చూడొచ్చు.

విజయ్ దేవకొండ పెర్ఫామెన్స్

విజయ్ దేవకొండ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మీరు కొన్న టికెట్ కు మంచి వినోదం అందుతుంది.

సాగదీశారు

సెకండ్ హాఫ్ ని సాగదీశారు. అయినా కూడా చిత్రంలో ఫన్ బావుంది.

బలహీనమైన కథ

టాక్సీవాలా చిత్ర కథ బాలహీనంగా ఉంది. బ్యాగ్రౌండ్ సంగీతం, స్క్రీన్ ప్లే బావున్నాయి. మొత్తంగా నిరాశపరిచేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X