సినిమా ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మీరే ప్రాణం పోశారు.. విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే గీత గోవిందం, నోటా చిత్రాలకు ఉన్న అంచనాలు టాక్సీవాలాపై లేవు. చిత్ర చాలా రోజులుగా వాయిదా పడుతూ ఉండడంతో విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశపడ్డారు. ఎట్టకేలకు నవంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. తొలి షో నుంచే టాక్సీవాలా చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తన దర్శత్వంతో అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ లో పాల్గొంటున్నారు.

థియేటర్స్‌లో సందడి
టాక్సీవాలా చిత్రానికి సూపర్ రెస్పాన్స్ లభిస్తుండడంతో చిత్ర యూనిట్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. సక్సెస్ టూర్ లో పాల్గొంటూ చిత్ర యూనిట్ ప్రేక్షకులని ఉత్సాహపరుస్తున్నారు. నేడు టాక్సీవాలా చిత్ర యూనిట్ పలు థియేటర్స్ లో అభిమానులని కలిశారు. ఇక్కడ కూడా విజయ్ తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.

చచ్చిపోయింది అనుకున్నా
థియేటర్ లో అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీ అందరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మూడు నెలల ముందే సినిమా పైరసీ లీక్ అయిపోయింది. ఇక మా సినిమా చచ్చిపోయింది అని అనుకున్నాం. కానీ ఇలా మీరంతా థియేటర్స్ కు వచ్చి సినిమాకు ప్రాణం పోశారు అని విజయ్ తెలిపాడు.

ఇక ప్రశాంతంగా ఉంటా
తన తరువాత సినిమా విడుదల కావడానికి చాలా సమయం పడుతుంది. టాక్సీవాలా చిత్రం విజయం సాధించింది కాబట్టి అప్పటివరకు ప్రశాంతంగా ఉంటా అని విజయ్ దేవరకొండ అభిమానులతో అన్నాడు. సినిమా విజయం సాధించింది కాబట్టి మీ అందరికి నేను ట్రీట్ ఇస్తున్నా. ఇంటర్వెల్ లో మీకు నచ్చిన స్నాక్స్ తీసుకోండి. మేము బిల్ కడుతాం అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

బాక్సాఫీస్ వద్ద జోరు
విజయ్ దేవరకొండ యువతలో క్రేజీ హీరోగా మారిపోయాడు. అందుకు తగ్గట్లుగా టాక్సీవాలా చిత్రం నుంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. దీనితో చిత్ర యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది. విజయ దేవరకొండ సరసన ప్రియాంక జావాల్కర్ హీరోయిన్ గా నటించింది. చక్కటి హర్రర్ కథాంశంతో దర్శకుడు రాహుల్ వినోదాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











