విజయ్ దేవరకొండకు మరో షాక్: ‘టాక్సీవాలా’ సినిమా మొత్తం లీక్!
Recommended Video

'గీత గోవిందం' సినిమా విడుదల ముందు దర్శక నిర్మాతలతో పాటు హీరో విజయ్ దేవరకొండ ఎంతలా టెన్షన్ పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలోని సీన్లు లీక్ కావడంతో చిత్ర బృందం మొత్తం డీలా పడిపోయింది. అయితే లీక్ అయింది కొన్ని సీన్లు మాత్రమే కావడంతో పెద్దగా నష్టం ఏర్పడలేదు. 'గీత గోవిందం' విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ మొత్తం హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ సారి విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్ బేనర్‌కు అంతకు మించిన షాక్ తగిలింది. 'టాక్సీవాలా' చిత్రం హెచ్‌డి ప్రింట్ మొత్తం బయటకు లీకైంది.

ఎలా బయటకు ఎలా వెళ్లింది?
‘గీత గోవిందం' సీన్ల లీక్ సమయంలోనే ‘టాక్సీవాలా' సినిమా మొత్తం లీకైనట్లు సమాచారం. ఆ సీన్లు దొగిలించి తీసుకెళ్లిన హార్డ్ డిస్కులో అంతకు ముందు ‘టాక్సీవాలా' సినిమా కాపీ చేశారని, ఆ హార్డ్ డిస్క్ నుండి దాన్ని డిలీట్ చేసినప్పటికీ.... డాటా రికవరీ ద్వారా దుండగులు ‘టాక్సావాలా' మొత్తం సినిమా లాగారని టాక్.

సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న హెచ్‌డి లింకులు
‘టాక్సీవాలా' చిత్రం హై డెఫనెషన్ ప్రింట్‌ను లింకులను కొందరు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతలు సీరియస్‌గా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గూగుల్ డ్రైవ్ నుండి లీక్
సినిమాను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి... ఆ లింక్స్ షేర్ చేస్తున్నారు. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీ-మెయిల్ అకౌంట్ల ద్వారా ఈ వీడియో లింక్స్ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

టాక్సీవాలా
విజయ్ దేవరకొండ హీరోగా జిఏ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ నిర్మాత. నూతన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఈ ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో సినిమా విడుదల నిలిపివేశారు.


Click it and Unblock the Notifications











