విజయ్ దేవరకొండకు బిగ్ ఛాలెంజ్.. ఆ రికార్డు టాక్సీవాలాకు సాధ్యమేనా!

Recommended Video

Taxiwala Will Cross Geetha Govindam's TRP Record? | Filmibeat Telugu

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన ఈ యువ హీరో గత ఏడాది గీత గోవిందం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పట్టిందల్లా బంగారమే అవుతోంది. గత ఏడాది విజయ్ దేవరకొండ రెండు మరచిపోలేని విజయాలు సొంతం చేసుకున్నాడు. అందులో ఒకటి గీత గోవిందం కాగా మరొకటి టాక్సీవాలా. మధ్యలో నోటా నిరాశపరిచినా అది పెద్ద ఇబ్బంది కాలేదు. తాజాగా టాక్సీవాలా చిత్రం మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

బుల్లితెరపై సందడి

బుల్లితెరపై సందడి

టాక్సీవాలా చిత్ర బుల్లితెర ప్రీమియర్ ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ప్రతి చిత్రానికి మంచి శాటిలైట్ ధర పలుకుతుండడంతో బుల్లితెర ప్రీమియర్స్ కూడా కీలకం కానుంది. ప్రముఖ జీ తెలుగు ఛానల్ టాక్సీవాలా చిత్రాన్ని టెలికాస్ట్ చేయనుంది. దీనితో టాక్సీవాలా చిత్రానికి ఎలాంటి టిఆర్పి రేటింగ్స్ నమోదవుతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

బిగ్ ఛాలెంజ్

బిగ్ ఛాలెంజ్

టాక్సీవాలా చిత్ర టివి ప్రీమియర్ విజయ్ దేవరకొండకు బిగ్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతడి గత చిత్రం గీత గోవిందంకు హైయెస్ట్ టిఆర్పి రేటింగ్స్ నమోదయ్యాయి. గీత గోవిందం చిత్రం రికార్డు స్థాయిలో 20,8 రేటింగ్ ని సాధించింది. టాలీవుడ్ చిత్రాలలో అత్యధిక రేటింగ్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో టాక్సీవాలా ఆ స్థాయి రేటింగ్ అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

ఎలాంటి అంచనాలు లేకుండా

ఎలాంటి అంచనాలు లేకుండా

వాస్తవంగా టాక్సీవాలా చిత్రం విడుదలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన టాక్సీవాలా చిత్రం ఘనవిజయం సాధించింది. టాక్సీవాలా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం 7 కోట్లు. కానీ విడుదలయ్యాక అంతకు మూడింతలుగా 21 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

 కొత్తవారితో

కొత్తవారితో

ఈ చిత్రాన్ని శ్రీనివాస్ కుమార్ నిర్మించారు. డెబ్యూ దర్శకుడు రాహుల్ విభిన్నమైన కథతో మ్యాజిక్ చేశాడు. ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మాళవిక నైర్, నటి కళ్యాణి కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని కూడా భరత్ కమ్మ అనే డెబ్యూ దర్శకుడే తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X