హరికృష్ణ జర్నీపై రూమర్లు.. ఎన్టీఆర్ అభిమాని పెళ్లికి వెళ్తుండటంపై వివరణ!
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై మాజీ ఎంపీ, సినీ నటుడు హరికృష్ట మరణించాడనే వార్త టాలీవుడ్‌ను, తెలుగు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన ఓ పెళ్లికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే హరికృష్ణ వెళ్లేది ఎన్టీఆర్ అభిమాని ఇంట్లో పెళ్లికి అనే విషయం మీడియాలో కథనాలుగా వచ్చాయి. వాటిపై టీడీపీ పార్టీ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

హరికృష్ణ వెళ్లింది..
హరికృష్ణ వెళ్లింది ఎన్టీఆర్ అభిమాని ఇంట్లో పెళ్లికి కాదు. అది కాకుండా ఆయన వెళ్లుతున్నది నెల్లూరు కాదు. దానికి సమీపంలోని కావలికి. కావలిలోని ట్రావెల్స్ మోహన్ అనే తెలిసిన వ్యక్తి కుమారుడి పెళ్లికి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని సరి చూసుకోవాలని టీడీపీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఎవరీ ట్రావెల్ మోహన్?
ట్రావెల్ మోహన్ అనే వ్యక్తి సినీ పరిశ్రమలో ట్రావెల్స్ నడుపుతుంటాడు. హరికృష్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన స్వయంగా పెళ్లికి హాజరయ్యేందుకు కావలి బయలుదేరాడని సన్నిహితులు వెల్లడించారు.

డివైడర్ ఢీకొట్టడంతో ప్రమాదం
హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నం హరికృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్ మెహదీపట్నంలోని తన నివాసానికి తరలించారు.

నల్లగొండ జిల్లాలోనే మూడోసారి
గతంలో 9వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ నల్లగొండ జిల్లాలోనే ఎన్టీఆర్, జానకిరాం ప్రమాదానికి గురయ్యారు. ఆ దుర్ఘటనలో జానకిరాం రెండేళ్ల క్రితం మరణించారు. తాజాగా హరికృష్ణ కూడా నల్లగొండ జిల్లాలోనే ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.


Click it and Unblock the Notifications











