జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ లీడర్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఒక్కడే మనవడు కాదు అంటూ!
తెలుగు సినిమా పరిశ్రమలోకి పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్న అతడు.. మధ్యలో పరాజయాలు ఎదురైనా 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దీంతో యమ జోష్‌తో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ముఖ్య నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే...
ఫుల్ ఫామ్‌లో.. దేవరగానే
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇలా ఏకంగా ఆరు విజయాలను అందుకుని డబుల్ హ్యాట్రిక్‌ను సాధించాడు. అదే సమయంలో RRR మూవీతో గ్లోబల్ ఇమేజ్‌ను సైతం అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఉత్సాహంతోనే ఉన్న ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్నాడు.

ఆ భారీ చిత్రాల్లో ఎన్టీఆర్
'దేవర' మూవీని ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇది షూటింగ్ జరుగుతుండగానే బాలీవుడ్‌లో 'వార్ 2' అనే చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్‌లో సైతం అతడు పాల్గొన్నాడు. వీటితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు. దీన్ని ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు.

ఎన్నికల సమయంలోనూ
జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి మాదిరిగా ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. కానీ, అతడి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతడి పేరును వైసీపీ వాళ్లు మాత్రం పెద్దగా వాడుకోవడం లేదు.
తారక్‌పై వెంకన్న టార్గెట్
జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకున్నా పేరు హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు అతడిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అందులోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా వెంకన్న అయితే ఎన్టీఆర్‌ను బాగా టార్గెట్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సార్లు కాంట్రవర్శీ కామెంట్లను చేశాడు.

తారక్‌కు సపోర్ట్ చేయను
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను టీడీపీలోనే కొనసాగుతాను. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పని చేయడానికి సిద్దం. కానీ, ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేయను' అని పేర్కొన్నారు.
ఒక్కడే మనవడు కాదని
ఇదే ఇంటర్వ్యూలో బుద్దా వెంకన్న కొనసాగిస్తూ.. 'ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడే. కానీ, ఆయన లాంటి మనవళ్లు చాలా మందే ఉన్నారు. లోకేష్ కూడా ఎన్టీఆర్ గారి మనవడే. ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేయలేదా' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై తారక్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











