జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు: అసలు సంబంధమే లేదు.. పార్టీ కోసం ప్రచారం అంటూ!
ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటి టీనేజ్‌లోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను అందుకున్న అతడు.. మధ్యలో పరాజయాలు ఎదురైనా కృంగిపోకుండా ముందుకెళ్లాడు.
దీంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి.. కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దీంతో యమ జోష్‌తో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

వరుస హిట్లు.. దేవరగా రెడీ
ఆ మధ్య కొన్ని ఫ్లాపులు వచ్చినా 'టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుకున్నాడు. ఇలా ఏకంగా ఆరు విజయాలను అందుకుని డబుల్ హ్యాట్రిక్‌ను సాధించాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా ప్రాజెక్టులు
ఇప్పుటికే 'దేవర' మూవీని దాదాపుగా పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇది పట్టాలపై ఉండగానే బాలీవుడ్‌లో 'వార్ 2' అనే చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్‌లో సైతం పాల్గొన్నాడు. వీటితో పాటు అతడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. దీన్ని వచ్చే ఆగస్టులో మొదలు పెడుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.

ఎన్నికల్లో హాట్ టాపిక్‌గానే
జూనియర్ ఎన్టీఆర్ గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. కానీ, అతడి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు బాగా హైలైట్ అయింది. అయితే, అతడి పేరును సొంత తెలుగుదేశం నాయకుల కంటే వైసీపీలోని కొందరు నేతలు బాగా వాడుకున్నారు.
టీడీపీ బాధ్యత లోకేష్‌కని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్ అవుతోన్న నేపథ్యంలో.. తాజాగా ఓ చర్చ తెరపైకి వచ్చింది. అదే.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్‌ను ప్రకటించమని ముఖ్య నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఈ అంశం హైలైట్ అవుతోంది. చాలా మంది ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రచారం చేయలే
తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు బుద్దా వెంకన్న తాజాగా ఓ టీవీ ఛానెల్ డిబెట్‌లో పాల్గొన్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ టాపిక్‌పై మాట్లాడుతూ.. 'అసలు జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీకి మధ్యన ఏముంది? ఆయన 2014 ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేయలేదు. 2019, 2024 ఎన్నికల సమయంలో కూడా రాలేదు కదా' అంటూ చెప్పుకొచ్చారు.
అసలు సంబంధం లేదు
ఇదే డిబెట్‌లో బుద్దా వెంకన్న కొనసాగిస్తూ.. 'ఎవరో ఏదో అన్నారని ఎన్టీఆర్ గురించి డిబెట్ పెట్టడం అనవసరం. వైసీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారని ఎవరూ ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీకి అస్సలు సంబంధమే లేదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తారక్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











