నా రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసు.. ఆయన భోజనం చేస్తుంటే కుర్చీ లాగేశారు!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా కొందరు సినీ తారలు సందడి చేస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో పెళ్లి పుస్తకం ఫేమ్ దివ్యవాణి జాయిన్ అయ్యారు. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ తరచుగా దివ్యవాణి వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల దివ్యవాణి తన సినీ జీవితం గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా గురించి తెలియక

నా గురించి తెలియక

రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజం. ప్రత్యేర్థులపై విమర్శలు చేయాలి.. వారి నుంచి విమర్శలు ఎదుర్కొనాలి. కానీ హద్దులు దాటే విధంగా కామెంట్స్ చేయకూడదని దివ్యవాణి అంటున్నారు. తన గురించి తెలియక ఎవరెవరో ఏదేదో వాగుతున్నారని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో దివ్యవాణి అన్నారు.పెళ్లి పుస్తకం చిత్రంతో దివ్యవాణి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాను నంది అవార్డు గెలుచుకున్న నటిని అని ఆమె తెలిపారు.

కుర్చీ లాగేశారు

కుర్చీ లాగేశారు

ప్రస్తుతం మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి కూడా ఒకప్పుడు చిన్న పాత్రలు చేసి పైకి వచ్చినవారే అని దివ్యవాణి తెలిపారు. చిరంజీవి గారు స్టార్ గా ఎదగక ముందు.. ఆయన భోజనం చేస్తుంటే పొడక్షన్ మేనేజర్ కుర్చీ లాగేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మేకప్ మ్యాన్ శివ తన కుర్చీని చిరంజీవికి ఇచ్చారు. అప్పటి నుంచే చిరు మేకప్ మ్యాన్ శివని గుర్తుంచుకున్నారు. స్టార్ గా ఎదిగాక శివని చిరు తన పర్సనల్ మేకప్ మ్యాన్ గా పెట్టుకున్నారని దివ్యవాణి అన్నారు. ఇప్పటికి శివ చిరు వద్దే పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

చిరంజీవికి తెలుసు

చిరంజీవికి తెలుసు

కొండవీటి దొంగ షూటింగ్ జరుగుతుండగా ఓ సన్నివేశం త్వరగా పూర్తిచేయాల్సి వచ్చింది. అదే సమయంలో బాగా నటించాలి. చిరంజీవితో కలసి ఆ సన్నివేశాన్ని సింగిల్ టేక్ లో పూర్తి చేశా. ఆ సమయంలో చిరంజీవి గారు పిలిచి మంచి ఆర్టిస్ట్ అవుతావు అని ప్రశంసించారు. నా రేంజ్ ఏంటో, నేను ఎలాంటి నటినో చిరంజీవికి తెలుసు అని దివ్యవాణి అన్నారు. అలాంటి నాపై కొందరువిచిత్రమైన విమర్శలు చేస్తున్నారు అని దివ్యవాణి అన్నారు.

పవన్ కల్యాణే సమాధానం చెప్పాలి

పవన్ కల్యాణే సమాధానం చెప్పాలి

కొన్ని రోజుల క్రితం ట్రాన్స్ జెండర్ తమన్నా దివ్యవాణిపై తీవ్రవిమర్శలు చేసింది. దివ్యవాణి ఒక జోకర్.. ఆమె కేవలం జూనియర్ ఆర్టిస్టు అని వ్యాఖ్యానించింది. దీనిపై దివ్యవాణి మాట్లాడుతూ.. జనసేనకు చెందిన ఎవరో ఒకరు నన్ను తక్కువ చేస్తూ మాట్లాడినట్లు తెలిసింది. ఆమె పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు. పార్టీ తరుపున పరువునష్టం దావా వేస్తె పవన్ కళ్యాణ్ గారే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని దివ్యవాణి అన్నారు. తన పార్టీలో బాధ్యతగల నాయకులని పెట్టుకోవాలని దివ్యవాణి సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X