Breaking రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే.. 1 కోటి రూపాయల బహుమానం!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్, కోర్టు సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నది. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాంగోపాల్ వర్మకు డెత్ వార్నింగ్ వచ్చిన వివరాల్లోకి వెళితే..
Recommended Video

వ్యూహం సినిమాకు సంబంధించిన రకరకాల సమస్యలు ఆర్జీవి మెడకు పడేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ను ఓటీటీ, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఆపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ నేత లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించింది.

ఇదిలా ఉండగా, వ్యూహం సినిమాతో తమ నాయకుడు చంద్రబాబు, లోకేష్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులపై అవాస్తవ సంఘటనలు, అభూత కల్పనలతో తెరకెక్కించారు. సమాజానికి కంటకంగా మారిన ఈ వ్యక్తి తలను నరికి తెస్తే 1 కోటి రూపాయలు ఇస్తానని ఓ టీవీ షో డిబేట్ సందర్భంగా టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు బహిరంగ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.
ప్రముఖ టీవీ ఛానెల్‌లో వ్యూహం సినిమాపై జరిగిన డిబేట్ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయనను టెలివిజన్ యాంకర్ వారిస్తున్న పదే పదే ఆ వ్యాఖ్యలు చేశారు. దాంతో చట్టబద్దంగా మాట్లాడాలని ఆయన వారిస్తున్న ఆయన మూడు, నాలుగు సార్లు వర్మ తల నరికి తెచ్చి ఇచ్చిన వాడికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
టెలివిజన్ డిబేట్‌లో కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి... ఏపీ పోలీసులకు విన్నపం. కొలికపూడి శ్రీనివాసరావు నన్ను చంపడానికి 1 కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడు. టీవీ హోస్ట్ సాంబశివరావు కూడా రెచ్చగొట్టేలా వ్యవహరించి పదే పదే ఆ వార్నింగ్ ఇచ్చేలా చేశాడు. ట్విట్టర్‌లో చేసిన కంప్లైంట్‌ను నా నుంచి వచ్చిన అఫీషియల్ కంప్లైంట్‌గా భావించండి అని వర్మ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











