లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు షాక్.. రిలీజ్ ఆపేయాలంటూ ఈసీకి ఫిర్యాదు!
దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా మొదలైపోయింది. అయినా కూడా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మొదటి నుంచి ఈ చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ ఎన్టీఆర్ చరిత్రని వక్రీకరించి విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనేది టిడిపి నాయకుల వాదన. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొందరు టీడీపీ నాయకులు ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందించారు.

ఈ చిత్రంలో చిత్రంలో చంద్రబాబు పాత్రని నెగిటివ్ గా చూపించారని టిడిపి ఆరోపిస్తోంది. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వైస్రాయ్ సంఘటన, ఎన్టీఆర్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు లాంటి వివాదాస్పద అంశాలని వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నారు. కనీసం ఈ చిత్రాన్ని ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు అయినా అడ్డుకోవాలని టిడిపి నేతలు కోరుతున్నారు. ఈ పరిణామాల మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22న విడుదలవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











