‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆపేందుకు టీడీపీ నేతల చివరి ప్రయత్నం, ఏపీలో రిలీజ్ అవుతుందా?
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విలన్‌గా చూపించారని, ఇది ఎన్నికలపై ప్రభావం పడుతుందని, పోలింగ్ ముగిసే వరకు సినిమాను ఆపాలంటూ ఇప్పటికే టీడీపీ నేతలు ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ హైకోర్ట్ టీడీపీ నేతలు వేసిన పిటీషన్ తోసిపుచ్చుతూ విడుదలకు లైన్ క్లియర్ చేసింది. సెన్సార్ నుంచి కూడా ఈ చిత్రానికి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ వచ్చింది. ఎన్నికల కమీషన్ సైతం సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే టీడీపీ నేతల ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కనీసం ఏపీలో అయినా సినిమాను ఆపాలని ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు..
సినిమా విడుదల ఎన్నికలు ముగిసే వరకు ఆపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ నేతలు నిన్న(మార్చి 27) లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. అయితే కోర్టు ఈకేసును గురువారం(మార్చి 28)కి వాయిదా వేసింది.

లైన్ క్లియర్ అవుతుందా?
సినిమా విడుదల ఆపాలంటూ టీడీపీ నేతలు వేసిన పిటీషన్ మీద కోర్టు గురువారం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది చర్చనీయాంశం అయింది. కోర్టు తీర్పు మీదే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా విడుదలవుతుందా? లేదా? అనేది ఆధారపడి ఉందని టాక్.

అందుకే ఆర్జీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కేన్సిల్ చేశారట
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ రిలీజ్ నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషయం ఎటూ తేలక పోవడంతో వర్మ దీన్ని కేన్సిల్ చేశాట. అన్ని అడ్డంకులు తొలగాలనే వర్మ వెయిట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

వెన్నుపోటు పర్వం ప్రధానంగా
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చర్చిస్తూ... రామారావు కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మారిన పరిణమాలు ఫోకస్ చేస్తూ, వెన్నుపోటు పర్వాన్ని హైలెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఉండబోతోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.


Click it and Unblock the Notifications











