జూ.ఎన్టీఆర్ గురించి టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మరో రెండేళ్లలో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ముడిపెడుతూ ఎన్టీఆర్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. తాజగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ గురించి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

పార్టీ మారుతున్నట్లు ప్రచారం

పార్టీ మారుతున్నట్లు ప్రచారం

కొన్ని నెలల క్రితమే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా మరొకరు మెచ్చా నాగేశ్వర రావు. నాగేశ్వర రావు ఖమ్మం జిల్లా అశ్వారావు పేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించే క్రమంలో జూ.ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 మరో రెండేళ్లలో

మరో రెండేళ్లలో

సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాగేశ్వరరావు కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మరో రెండేళ్లలో తెలంగాణ టిడిపి జూ. ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లబోతోంది. జూ. ఎన్టీఆర్ నాయకత్వంలో పార్టీ తిరిగి పూర్వవైభవంలోకి రాబోతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వరరావు ఏ సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కానీ.. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చ అయితే మొదలైంది.

2009లో

2009లో

2009లో జూ. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ కోసం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రమాదానికి సైతం గురయ్యాడు. ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మరే రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సోదరి సుహాసిని కోసం ప్రచారం చేస్తాడని వార్తలు వచ్చినా అది కూడా జరగలేదు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో

ఆర్ఆర్ఆర్ చిత్రంలో

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్నాడు. వరుస విజయాలు వరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ రాజకీయాలని టచ్ చేస్తాడా అనేది పెద్ద ప్రశ్నే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X