ఉత్తరాంధ్రలో చిరంజీవి ప్రభంజనానికి బ్రేక్ వేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రయోగించాలని తెలుగు దేశం పార్టీ నేతలు భావిస్తున్నారు.దాంతో ఎన్టీఆర్ శ్రీకాకుళం నుంచి పార్టీ పర్యటనను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ రోడ్‌షోలపై పార్టీ ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. దీనిపై ఆదివారం చంద్రబాబు, నందమూరి హీరోలందరినీ కలసి చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదే రోజున ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో బాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించనున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ రోడ్‌షో గురించి కూడా చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు.ఏదైమైనా పార్టీ లక్ష్యం ఎన్టీఆర్ ని పూర్తి స్ధాయిలో చిరంజీవి ప్రభంజనానికి బ్రేక్ వేయటానికే వినియోగించాలనేది.అది నెరవేరటానికే వ్యూహాలు రచిస్తున్నారు.