ప్రజారాజ్యం పార్టీకి సిద్ధాంతాలు,నియమాలు,మానిఫెస్టో వంటివి లేవని..అది రంగు,రుచి,వాసన లేని పార్టీ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా విమర్శించారు. హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ ప్రాంతంలో డాల్ఫిన్ మీటింగ్ హాల్ లో తెలుదేశం నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్భన్ బూత్ టీడీపి కన్వీనర్ల సమావేశాన్కి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ పీఆర్పీ వ్యవస్ధాపులకు మహిళలను గౌరవించే సాంప్రదాయం లేదని,అటువంటి వారికి పట్టం కడితే మహిళలు సామాజికంగా ఎదగలేరని ఆమె అన్నారు. పాడి ఆవులాంటి టిడీపిని వదులుకుని కుళ్ళబొడిచే ఆంబోంతులాంటి కాంగ్రేస్ ను ఎన్నుకున్నందుకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బతుకు బండిని ఈడ్చలేక ఆత్మహత్యలు చేసకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల,బెల్టు షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయటం వల్ల కాంగ్రేస్ ప్రభుత్వంపై రాష్ట్ర మహిళలు చాలా అసంతృప్తితో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.