Teachers Day: గురువులను స్మరించుకొని.. మహేష్ బాబు, ప్రకాశ్ రాజ్ ఎమోషనల్

ఉపాధ్యాయ దినోత్సవం రోజున పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీన దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు తమ గురువులను స్మరించుకొన్నారు. తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మలయాళ నటుడు, ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌలీ సోషల్ మీడియాలో స్పందించారు. వారు తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ..

మహేష్ బాబు ఎమోషనల్‌గా

మహేష్ బాబు ఎమోషనల్‌గా

టీచర్స్ డే‌ను పురస్కరించుకొని మహేష్ ట్విట్టర్‌లో స్పందించారు. అభ్యాసానికి సరిహద్దులు లేవు. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు ఉత్తమంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో ఎంతో మంది స్ఫూర్తినిచ్చిన, నాకు పలు విషయాలను నేర్పించిన వ్యక్తులు, నన్ను నడిపించిన ప్రతీ ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

ప్రకాశ్ రాజ్ భావోద్వేగంతో

ప్రకాశ్ రాజ్ భావోద్వేగంతో

టీచర్స్ డే రోజున జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేష్‌ను గుర్తు చేసుకొంటూ భావోద్వగమయ్యారు. నేను ఇంత వాడిని కావడానికి తోడ్పాటునందించిన, ఎన్నో రకాలుగా స్పూర్తిగా నిలిచిన నా టీచర్లకు, ముఖ్యంగా గౌరీకి స్పెషల్ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం పిరికిపందలు నిన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్లారు. కానీ భయమే లేని ఓ స్ఫూర్తి మాతోనే ఉంది. నీవు లేని లోటు ఇంకా వెంటాడుతూనే ఉంది.. నన్నుగౌరి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ అయ్యారు.

సాయిధరమ్ తేజ్ గురువులను స్మరించుకొంటూ

సాయిధరమ్ తేజ్ గురువులను స్మరించుకొంటూ

టీచర్స్ డే రోజున సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. మనం ఈ రోజు ఇంత ఎత్తుకు ఎదిగామంటే అందుకు కారణం టీచర్లే. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. సరైనా మార్గంలో నడిపించడానికి, మంచి భవిష్యత్ ఉండాలని వారు పడిన తాపత్రయం మాటల్లో చెప్పలేం. మన జీవితాల్లో గొప్ప పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

డైరెక్టర్లే నా గురువులు అంటూ వరుణ్ తేజ్

డైరెక్టర్లే నా గురువులు అంటూ వరుణ్ తేజ్

నా జీవితంపై ఎక్కువగా ప్రభావితం చేసిన వారిలో నా డైరెక్టర్లే ఉన్నారు. మీరే నా లైఫ్‌పై బలమైన ప్రభావం చూపించారు. ఒక్క సినిమా డైరెక్టర్ గురించి చెబితే చాలదు. మీ అందరిని గురువులుగా భావించి గుర్తు చేుకోవాల్సిందే అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, వెంకీ అట్లూరి, సంకల్ప్ రెడ్డి, అనిల్ రావిపూడి డైరెక్టర్ల ఫోటో పెట్టి ట్వీట్ చేశారు.

Recommended Video

Hero Sudheer Babu Special Interview On 'V' Movie
నవీన్ పౌలీ ట్వీట్స్‌తో

నవీన్ పౌలీ ట్వీట్స్‌తో

మలయాళ నటుడు నవీన్ పౌలీ టీచర్స్ డే రోజున తన ఉపాధ్యాయుల సేవలను స్మరించుకొన్నారు. నాలోని ప్రతిభను గుర్తించిన ప్రతీ ఉపాధ్యాయుడికి నా శుభాకాంక్షలు. స్కూల్, కాలేజీ స్థాయిలో నాకు సరైన మార్గం చూపించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా కలల్ని సాకారం చేసుకోనే ప్రయాణంలో తోడ్పాడిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు అంటూ నవీన్ పౌలీ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X