»   » సైజ్ జీరో: అనుష్క అండ్ టీం సరికొత్త ప్రచారం....(ఫోటోస్)

  సైజ్ జీరో: అనుష్క అండ్ టీం సరికొత్త ప్రచారం....(ఫోటోస్)

  By Bojja Kumar

  హైదరాబాద్: ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . స్టార్ హీరోయిన్ అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

   

  ఇందులో అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అనుష్కను చూసిన అభిమానులు ఆమె భారీ కాయంతో ఉండటాన్ని చూసి షాకయ్యారు. తమ కలల దేవతనను తెరపై ఇలా చూస్తామని వారు బహుషా ఊహించి ఉండరు.

  డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.

  ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న, వరల్డ్ వైడ్ గా 1500 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్రయూనిట్ పెర్కొంది.

  అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

  రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ‘సైజ్ జీరో' టీం సరికొత్తగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్లకార్డుల కాంపెయిన్ ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

  అనుష్క

  అనుష్క

  అందం అనేది కేవలం సైజు వల్ల రాదు అనే ప్లకార్డుతో అనుష్క.

  ఆర్య...

  ఆర్య...

  ఫిట్ నెస్ గురించి ఫ్లకార్డులతో ఆర్య.

  సోనాల్ చౌహాన్

  సోనాల్ చౌహాన్

  హెల్తీగా జీవించాలనే ప్లకార్డుతో హీరోయిన్ సోనాల్ చౌహాన్.

  ప్రకాష్ కోవెలమూడి

  ప్రకాష్ కోవెలమూడి

  నువ్వు ఎవరు అనేది నువ్వే డిసైడ్ చేయాలి...సమాజం కాదు అనే ప్లకార్డుతో దర్శకుడు ప్రకాష్.

  కనిక దిల్లన్

  కనిక దిల్లన్

  ప్లకార్డులతో దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక దిల్లన్.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X