'ఓ దశలో సినిమా ఆగిపోయింది... అయినా కూడా..?
భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన చిత్రం ''కుటుంబ కథా చిత్రం''. ఈ చిత్రానికి వి.ఎస్.వాసు దర్శకుడు.
Recommended Video

భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన చిత్రం ''కుటుంబ కథా చిత్రం''. ఈ చిత్రానికి వి.ఎస్.వాసు దర్శకుడు.గురువారం ఉదయం హైదరాబాద్ లో ఈ సినిమా పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అందరూ హాజరయ్యారు.
ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమా నిర్మాత భాస్కర్ యాదవ్ నన్ను చాలా విసిగించాడు. నేను కొన్ని సార్లు ఇటువంటి సినిమాలు చిన్న సినిమాలు నడవవు అని కూడా అన్నాను.
కానీ తను మొండిగా కష్టపడ్డాడు. సినిమా చేసి చూపించాడు. నిజానికి ఈ సినిమాకి నిర్మతనే హీరో అంటూ చాలా ఆవేశంతో చిన్న సినిమాలు విడుదల చేసుకోటానికి సరిగా థియేటర్స్ కుడా లేవు.. ఇటువంటి పరిస్థితుల్లో కుడా సినిమాలు తీస్తున్నారు అంటే సినిమా మీద ఎంత అభిమానం వుందో తెలుసుకోవాలి. నా వంతుగా నేను సాహసం చేస్తాను సినిమా విడుదల కోసం నేను ముందు నిలబడుతా అంటూ వేదిక సాక్షిగా నిర్మాతకి మాటిచ్చారు.
ఈ చిత్ర నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ నిజానికి వాసు కధ చెప్పగానే ఓకే చేసిన సినిమా ఇది వాసు కొత్త దర్శకుడైన అనుకున్న బడ్జెట్లోనే అనుకున్న టైం కే పూర్తి చేసాడు.,కొన్ని సార్లు సినిమా ఆగి పోయినా యూనిట్ అందరు సపోర్ట్ చేసి సినిమా పూర్తి చేయటం జరిగింది.,ఈ సినిమా మీద చాలా
నమ్మకం వుంది.,మంచి టైం చూసుకుని విడుదల చేస్తాం ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాం అందరు సహకరించాలని కోరారు.


Click it and Unblock the Notifications











