Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విభిన్నంగా : నిఖిల్ ‘సూర్య vs సూర్య’(టీజర్ )
హైదరాబాద్: ‘స్వామి రా రా', ‘కార్తికేయ' అంటూ విభిన్న చిత్రాలతో ముందుకు వెళ్తున్న నిఖిల్ మరో విభిన్న కాన్సెప్టు తో ముందుకు వస్తున్న చిత్రం సూర్య vs సూర్య'. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని మీరూ ఇక్కడ వీక్షించండి.
నిఖిల్ మాట్లాడుతూ... "సూర్య అస్తమయం ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి 2014 చివరి సన్ సెట్ కి మించిన మంచి సమయం లేదు' అని ట్వీట్ చేసాడు. అందుకు తగినట్లే పోస్టర్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి.
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘హ్యాపీ డేస్' తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య'. ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘కార్తికేయ' సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.