బిజినెస్ మ్యాన్ ఆ టీజర్ చూడొద్దు: తమన్
రెండు రోజుల క్రితం మహేష్ తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ టీజర్ అంటూ విడుదలై అంతటా హాట్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ ఫేక్ అంటూ బాంబ్ పేల్చారు.. ఆ చిత్రంకి సంగీతం అందిస్తున్న తమన్. ఆయన ట్వీట్ చేస్తూ.. హాయ్ ప్రెండ్స్.. అది ఫేక్ టీజర్.. దాన్ని చూడొద్దు.. దయచేసి.. 11:11:11 ఆగండి.. పైరసీకి వ్యతిరేకంగా ఫైట్ చేయటానికి మాకు సహకరించండి అన్నారు. అంతేగాక తాను ఈ చిత్రం కోసం సౌండ్, బిజియంల కోసం చాలా కష్టపడి పని చేసానన్నారు. అలాగే టీజర్.. ఈ సూర్య అనే వాడు అంటూ స్టార్ట్ అవుతుంది. సింగిల్ లైన్ తో హై క్వాలిటీ సౌండ్ తో ముప్పై సెకెండ్ల డ్యూరేషన్ తో ఈ టీజర్ ఉంటుందని తెలియచేసారు.
ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు.. అమ్మకాల చుట్టూ తిరగనుంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై పూరి జగన్నాధ్ ఈ రూపొందిస్తున్న చిత్రం సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











