తేజస్వి మదివాడ మరో డిఫరెంట్ మూవీ.. "సర్కస్ కార్-2".. స్పెషల్ పాత్రలో బిగ్ బాస్ ఫేమ్!

టాలెంటెడ్ యువ దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో వచ్చిన "సర్కస్ కార్" అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. "సర్కస్ కార్-2" పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ గా "తేజస్వి మదివాడ" విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతో ఆమె ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటోంది. ఇక సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ తేజస్వి మదివాడ మాట్లాడుతూ... నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో లో వచ్చిన "సర్కస్ కార్" నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అలాంటి కథకు సరికొత్త సీక్వెల్ రాబోతోంది అనగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా స్టోరీ బాగా నచ్చింది. అందుకే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉన్నట్లు తెలిపిన తేజస్వి "సర్కస్ కార్-2"లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి ప్రత్యేకంగా థాంక్స్.. చెబుతున్నట్లు వివరణ ఇచ్చారు.

Teaswi madivada Circus Car 2 movie update,

ఇక సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి కూడా స్పెషల్ పాత్రలో కనిపించినట్లు సమాచారం. ఇక మస్త్ అలీ ముఖ్యపాత్రలో నటించగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ క్రేజీ హారర్ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిరిస్తున్నారు. ఇక ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో రెగ్యులర్ షూటింగ్ ను కొనసాగిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇక ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె "సర్కస్ కార్" సాధించిన ఘన విజయం గురించి వివరణ ఇచ్చారు.

Teaswi madivada Circus Car 2 movie update,

ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్... ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ఇక దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలతో కలిగే వాటి పరిణామాలు ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా చేస్తాయని... భయంతో కూడిన వినోదాన్ని అందించి మంచి కిక్కిచ్చే చిత్రమే "సర్కస్ కార్-2" అని తెలియజేశారు. ఇక మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్. తేజస్వి మదివాడ, ఆషు రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుందని తెలియజేశారు.

సినిమాలో నటీనటులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారని భయంతో పాటు సరికొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని మంచి కామెడీ కూడా సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఇక బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి), నిర్మాత: శివరాజు వి.కె, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X