అదే మగధీరలో మిస్టేక్..చిరంజీవి
చిరంజీవి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయటమే కాక తప్పులు ఏమన్నా ఉంటే నిశితంగా గమనించటం కూడా మొదటి నుంచీ అలవాటు. అదే కోవలో ఆయన మగధీర చిత్రంలో ఓ సన్నివేశంలో తప్పును పట్టుకున్నారుట. ఆ విషయాన్ని రాజమౌళికి చెప్పినా అప్పటికే ప్రింట్స్ రెడీ అవటంతో సరిచేయలేదు. ఆ తప్పు మరోదో కాదు..ఓ సన్నివేశంలో షెర్ ఖాన్ పాత్ర ధారి శ్రీహరి భైనాక్యులర్ లోనుంచి ఉదయ్ ఘడ్ కోటను చూస్తూంటాడు. అయితే ఆ సమయంలో మనకు కోట తలక్రిందులుగా కనపడుతుంది. అయితే ఆ హడావిడిలో దాన్ని మనం గమనించం. అది గ్రాఫిక్స్ వారి తప్పు. దాన్నే చిరంజీవి పట్టుకుని చూపారు. అదీ సంగతి.
మగధీర శ్రీహరి చిరంజీవి బంగారుకోడి పెట్ట కాజల్ రాజమౌళి ఉదయ్ ఘడ్ బైనాక్యులర్ magadheera chiranjeevi ram charan rajamouli srihari


Click it and Unblock the Notifications