twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క మూవీ షూటింగ్ లో విషాదం: ఆ టెక్నీషియన్ మృతికి కారణం ఇదే

    బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ హీరోయిన్‌గా గ్లామరస్‌ లుక్‌లో కనిపించడమే కాదు. నిర్మాతగా సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మించింది అనుష్క.

    |

    బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ హీరోయిన్‌గా గ్లామరస్‌ లుక్‌లో కనిపించడమే కాదు. నిర్మాతగా సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మించింది అనుష్క.క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్ పై చేసిన ణ్ 10 మంచి విజయం పొందింది. కాకపోతే క్రిటిక్స్ మెచ్చేసుకున్నా కూడా డబ్బులు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఫిల్లౌరి కూడా నష్టం లేకుండా భారీ లాభాలు రాకుండా బాగానే ఆడింది. ఇంతవరకూ రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. "పరి" అనే సినిమాని నిర్మిస్తోంది.

    టెక్నిషియ‌న్ మ‌ర‌ణించాడు

    టెక్నిషియ‌న్ మ‌ర‌ణించాడు

    పాపం ఇన్ని భాదల మధ్య తీస్తున్న సినిమాకి మరో విషాదం రూపంలో ఆటంకం ఎదురయ్యింది. 'పరి' సినిమా షూటింగ్‌లో విషాదం జ‌రిగింది. కోల్ కతా లోని 24 పరగణాల జిల్లాలోని కరోల్ బెరియాలో ఔట్ డోర్ షూటింగ్ లో ప్ర‌మాద‌వశాత్తు ఓ టెక్నిషియ‌న్ మ‌ర‌ణించాడు. షూటింగ్‌లో ఓ వెదురు పొద చుట్టూ నటులు, వస్తువులు కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి లైవ్ వైర్లలోని ఓ వైరును పట్టుకోవ‌డంతో ఆ టెక్నిషియన్ ప్రాణాలు కోల్పోయాడు.

    షా ఆలమ్

    షా ఆలమ్

    అత‌డిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షా ఆలమ్ (28) అని పోలీసులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసు అధికారి ఒకరు స్పందిస్తూ...

    విచారణ జరుగుతోంది

    విచారణ జరుగుతోంది

    ‘‘ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించాం. నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ప్రాథమిక దర్యాప్తును బట్టి అతడు విద్యుదాఘాతానికి గురై చనిపోయినట్టు తెలుస్తోంది..'' అని వెల్లడించారు.

    రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్లనే

    రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్లనే

    అయితే షూటింగ్ లో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్లనే టెక్నీషియన్ మరణించాడనీ, అతనికుటుంబానికి ఆర్థిక సహాయం అందాల్సిందేననీ షూటింగ్ లో భాగంగా ఉన్న టెక్నీషియన్లంతా చిన్న వివాదానికి ప్రయత్నించినా. పూర్తి భాధ్యత తానే తీసుకుంటాననీ, బాదిత కుటుంబానికి అందాల్సిన సహాయాన్ని చేస్తాననీ చెప్పటం తో గొడవ సద్దు మణిగినట్టు సమాచారం.

    నివేదిక వచ్చిన తర్వాత

    నివేదిక వచ్చిన తర్వాత

    ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించామని వారు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత ఈ దుర్ఘ‌టన ఎలా జరిగిందనే విషయమై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. ఈ దుర్ఘటనతో 'పరి' షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

    English summary
    Shah Alam, a resident of Uttar Pradesh, had probably touched the live wire in a bamboo bush at the location spot after the shooting was over.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X