ఫస్ట్ వీక్ మగధీర, పోకిరి రికార్డులను కొల్లగొట్టిన పవన్ ‘తీన్ మార్’..!

By Sindhu

మొదటి నుండి పాజిటివ్ టాక్ తో ముందుకొచ్చిన 'తీన్ మార్" విడుదల తర్వాత రెండు రోజుల్లోనే కలెక్షన్స్ డౌన్ అయ్యాయంటూ వర్తలు వచ్చాయి..మరో వైపు పవర్ స్టార్ అభిమానులు..తీన్ మార్ తో పవన్ మరోసారి రికార్డుల రారాజు అవుతాడని ఎంతగానో ఎదురు చూశారు. కలెక్షన్స్ తగ్గడంతో మరో వైపు యాంటీ ఫ్యాన్స్ ఈ చిత్రంలో ఏం లేదంటూ ఎగతాళి చేయడం మొదలెట్టారు. మొదటి రోజు కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిన 'తీన్ మార్"కి సడెన్ గా కలెక్షన్స్ తగ్గిపోవడం ఏమిటి..?అని ఆలోచిస్తే...దీనిలో నిర్మాత గణేష్ బాబు తప్పిదం కూడా ఉందని తెలిసింది.

ఇప్పుడు విడుదల అవుతున్న చిత్రాలు..విడుదల తర్వాత కూడా సుమారు నెల రోజుల పాటు ప్రమోషన్ ని మొత్తం చేజేతులా నాశనం చేశాడని తెలిసింది..సరే ఆ విషయాలన్నీ ప్రక్కన పెడితే అసలు తీన్ మార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏలా వుండబోతున్నాయి...బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఈ చిత్రంతో సేఫ్ అవుతారా..!వీక్ అయిందా..?పవన్ ప్లాప్ ఇస్తేనే కలెక్షన్స్ దుమ్ము రేపుతాడు..మరి పాజిటివ్ గా మొదలైన తీన్ మార్ తో పవన్ తన స్టామినా ఏంటో చూపించగలిగాడా...! ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై ఓ లుక్కేదామా... పవన్ పవన్ ప్రమోషన్ కార్యక్రామాలు లేకపోయినా తన స్టామినా ఏంటో గట్టిగానే చూపించాడు. బయ్యర్లని, ఎగ్జిబిటర్లను ఇంకా ఈ చిత్రాన్ని నమ్ముకున్న వారందర్నీఫస్ట్ వీక్ తోనే సేఫ్ జోన్ లోనికి తీసుకెళ్లాడు... అదేలాగో తీన్ మార్ కలక్షన్స్ చూడండి.. తీన్ మార్ ఫస్ట్ డే కలక్షన్స్ : 9.4కోట్లు, సెకండ్ డే కలక్షన్స్: 4.8కోట్లు, థర్డ్ డే కలక్షన్స్: 5.2కోట్లు, ఫోర్త్ డే కలక్షన్స్: 4.1కోట్లు, ఫిప్త్ డే కలక్షన్స్: 3.1కోట్లు, సిక్త్స్ డే కలక్షన్స్: 3.1కోట్లు, సెవెన్త్ డే కలక్షన్స్: 2.1కోట్లు దీన్ని బట్టి చూస్తే వరల్డ్ వైడ్ గా మొత్తం వన్ వీక్ కి 31.8కోట్లు కొల్లగొట్టాడన్నమాట... 'ఇప్పటి వరకు మొదటి వారం కలక్షన్స్ రికార్డ్స్ లో ఉన్న మగధీర, పోకిరి చిత్రాలను ఈ తీన్ మార్ బ్రేక్ చేసి..తెలుగు చలన చరిత్రలో సరికొత్త రికార్డ్" ని క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X