వృద్ధుడిని అయిపోతున్నానన్న మాధవన్‌.. పెళ్లి చేసుకుంటానన్న 18 ఏళ్ళ అమ్మాయి

మాధవన్.. దక్షిణాదిలో ఈ హీరో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా తన ప్రభావాన్ని చూపించాడీ హ్యాండ్సమ్ హీరో. అప్పట్లో యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకున్నాడు. ముఖ్యంగా యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. 'సఖి', 'చెలి', 'రన్' సహా పలు సినిమాల ద్వారా తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు. ఏజ్ బార్ అవుతున్న అందంలో ఏమాత్రం మార్పు లేకుండా ఉంటున్న ఈ సీనియర్ హీరోకు తాజాగా ఊహించని అనుభవం ఎదురైంది.

ప్రస్తుతం ప్రపంచమంతా ఫేస్ యాప్ మయం అయిపోయింది. దానికి తగ్గట్లు చాలా మంది వృద్ధులు అయితే ఎలా ఉంటారో చూసుకుంటూ తమ ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. దీనిని ఉద్దేశిస్తూ తాజాగా మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన సెల్ఫీ పోస్ట్ చేశాడు. దానికి 'ఈ జీవిత ప్రయాణాన్ని భయం లేకుండా ఎంజాయ్ చేయాలి. ముసలివాడిని అయిపోతున్నా' అని ఆయన క్యాప్షన్ పెట్టాడు. దీనికి ఓ అమ్మాయి రిప్లై ఇచ్చింది.

Teenage Girl Gave Shock To Madhavan

మాధవన్ పోస్టుకు రిప్లై ఇస్తూ 'నా పేరు నైనా. నాకు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది తప్పంటారా?' అని రాసుకొచ్చింది. దీనిపై మాధవన్ స్పందించాడు. 'హ్హ హ్హ.. గాడ్‌ బ్లెస్‌ యూ. నాకంటే మెరుగైన వ్యక్తి మీకు తప్పకుండా దొరుకుతాడు' అంటూ సమాధానం ఇచ్చాడు. ఇది గమనించిన వారంతా మాధవన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన అందంపైనా కామెంట్లు చేస్తున్నారు.

మాధవన్ గత సంవత్సరం అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి'లో విలన్‌గా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ పాత్రలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అనంత్‌ మహాదేవన్‌, మాధవన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే 'నిశ్శబ్ధం' అనే చిత్రంలో అనుష్కకు జోడీగా నటిస్తున్నారు మాధవన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X