For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ 'తీన్‌మార్'కి మరో మెగా రికార్డు

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'తీన్‌మార్'త్వరలో మరో రికార్డుని నెలకొల్పనుంది.తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ నిర్మాత గణేష్...దాదాపు వెయ్యి థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.ఇదో రికార్డు.

    అలాగే పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకొనే విధంగా సినిమా రూపుదిద్దుకుంది. పవన్‌కళ్యాణ్ చిత్రాల్లోనే భారీగా ఈ సినిమాను రూపొందించాం.అలాగే 'ఖుషి' చిత్రం తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో తొలిసారిగా పవన్‌కళ్యాణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆ రెండు పాత్రలో ఆయన అభినయం అద్భుతం. అలాగే త్రివిక్రమ్ అందించిన అద్భుతమైన పంచ్ డైలాగులు థియేటర్లలో కేరింతలు కొట్టిస్తాయి. జయంత్ టేకింగ్ అందరినీ అలరిస్తుంది అన్నారు.

    ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది.త్రిష, కృతి హీరోయిన్లుగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ బేనరుపై గణేష్‌బాబు ఈ 'తీన్‌మార్' చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి సహ నిర్మాత: బడే రవి, సమర్పణ: శివబాబు, నిర్మాత: గణేష్‌బాబు, దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ.

    English summary
    Pawan Kalyan starrer Teenmaar is gearing up for its worldwide release on 14th April and the sensational news is the movie is all set to hit the screens in 1000 theaters, which is the biggest release for any Tollywood film till date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X