Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పవన్ కళ్యాణ్ 'తీన్మార్'కి మరో మెగా రికార్డు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'తీన్మార్'త్వరలో మరో రికార్డుని నెలకొల్పనుంది.తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ నిర్మాత గణేష్...దాదాపు వెయ్యి థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.ఇదో రికార్డు.
అలాగే పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకొనే విధంగా సినిమా రూపుదిద్దుకుంది. పవన్‌కళ్యాణ్ చిత్రాల్లోనే భారీగా ఈ సినిమాను రూపొందించాం.అలాగే 'ఖుషి' చిత్రం తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో తొలిసారిగా పవన్‌కళ్యాణ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆ రెండు పాత్రలో ఆయన అభినయం అద్భుతం. అలాగే త్రివిక్రమ్ అందించిన అద్భుతమైన పంచ్ డైలాగులు థియేటర్లలో కేరింతలు కొట్టిస్తాయి. జయంత్ టేకింగ్ అందరినీ అలరిస్తుంది అన్నారు.
ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది.త్రిష, కృతి హీరోయిన్లుగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ బేనరుపై గణేష్‌బాబు ఈ 'తీన్మార్' చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి సహ నిర్మాత: బడే రవి, సమర్పణ: శివబాబు, నిర్మాత: గణేష్‌బాబు, దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ.