»   » రంగస్థలంలో సుకుమార్ డ్యాన్స్ మాములుగా లేదుగా..

రంగస్థలంలో సుకుమార్ డ్యాన్స్ మాములుగా లేదుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
రంగస్థలంలో సుకుమార్ డ్యాన్స్ మాములుగా లేదుగా..!

ఒక్కొక్కరికి ఒక్కో ట్యాలెంట్ ఉంటుంది. అది అందరిలో బయటకు కనిపించదు. కొంతమందిలో ఓ టైం‌లో బయటపడుతుంటుంది. కొంతమందిలో మనసులోనే అవి ఆగిపొతూ వుంటాయి. అవి ఏ సమయంలో ఎలా బయటకు వస్తాయో చెప్పడం కష్టం.

దర్శకుడు సుకుమార్ అనగానే.. మనకు ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనే పదం గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం రంగస్థలం మూవీ షూటింగులో బిజీగా ఉన్న ఆయన వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి మార్చ్ 30న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఓ స్టూడియోస్‌ వేసిన సెట్స్‌లో 'రంగస్థలం' షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పాటు కొన్ని రియల్ లొకేషన్స్ లో కూడా చిత్రీకరణ జరుగుతోంది.

రంగస్థలం షూటింగ్ స్పాట్‌లో సుకుమార్ డ్యాన్సు వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయితే దర్శకుడు స్టెప్పులేయడమేంటీ ? అనుకోవచ్చు కానీ..సుకుమార్ మాత్రం తీన్ మార్ స్టెప్పులు వేసి ఇరగదీశాడనే చెప్పాలి.

కొరియోగ్రాఫర్స్‌తో డ్యాన్స్ చేస్తే ఎలా ఉండేదో కానీ.. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్షణ్ లతో కలిసి.. సుకుమార్ వేసిన తీన్ మార్ డ్యాన్స్ మాత్రం సూపర్బ్ గా ఉంది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ గ్యాప్ లోనే ఈ డ్యాన్సింగ్ ఎపిసోడ్ జరిగిందట. తనలో ఈ కళ కూడా ఉందని చెప్పకనే చెప్పాడు సుకుమార్.

English summary
Director Sukumar Teenmar Dance Performence At Rangastalam Shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu