అప్పుడు వేశ్య... ఇప్పుడు విలన్
ఆ సినిమాలో ఏమాత్రం సిగ్గు పడకుండా అందాలు ఆరబోసిన ఈ సుందరికి ఎందుకనో ఏ చిత్రంలో అవకాశం దక్కలేదు. చాలా కాలం తర్వాత దర్శకుడు తేజ కళ్లు ఆమెపై పడ్డాయి. అయితే తేజ ఆమెను అందాల ఆరబోతకు కాకుండా విలన్ పాత్రకు ఎంపిక చేశాడు. తేజ దర్శకత్వం వహించిన 'నీకు నాకు డాష్ డాష్' చిత్రంలో లేడీ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో తీర్థ లిక్కర్ మాఫియా క్వీన్ గా కనిపించబోతోందట.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ....'సొంత ఊరు' చిత్రం నటిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది. 'నీకూ నాకూ డాష్ డాష్' తెలుగు పరిశ్రమలో కమర్షియల్ బ్రేక్‌నిస్తుందన్న నమ్మకముంది. రెండో సినిమాకే తేజ లాంటి స్టార్ డైరెక్టర్ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని తెలిపింది.
ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన తేజపై ఈ భామ పెట్టుకున్న నమ్మకం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. లిక్కర్ మాఫియా నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో,హీరోయిన్స్ తో పాటు 42 కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications












