అక్షయ్‌కుమార్ ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం హిట్టా? ఫట్టా?
అక్షయ్‌కుమార్, కత్రీనాకైఫ్ కాంబినేషన్‌లో రెడీ అయి రిలీజైన క్రేజీ చిత్రం 'తీస్ మార్ ఖాన్" ఈ శుక్రవారం విడుదలైంది. అయితే ఈ చిత్రం చిత్రం విడుదలకు ముందు వచ్చిన క్రేజ్ తో ఓపినింగ్స్ తెచ్చుకోగలిగింది కానీ...ప్లాఫ్ టాక్ ని మాత్రం తప్పించుకోలేకపోయింది. మరో ప్రక్క ఈ చిత్రం1966లో వచ్చిన ఆఫ్టర్ ది ఫాక్స్ (పీటర్ సెల్లర్స్) అనే కామెడీ చిత్రంకి మక్కీకి మక్కి కాపీ అని ముద్ర వేయించుకుంది. ప్రముఖ దర్శకురాలుఫర్హాఖాన్ డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఓ దొంగగా కనిపించారు.
ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్న ట్రైన్ ని దోచటానికి అతను సినిమా డైరక్టర్ అవతారం ఎత్తుతాడు. ఇక ఈ చిత్రంలో ఫస్టాఫ్ మంచి కామిడీతో బాగున్నా సెకెండాఫ్ నీరసపరిచింది. దానికి తగ్గట్లే ఈ చిత్రానికి అంతటా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఓ వారం వరకూ కలెక్షన్స్ కు లోటుండదు కానీ, ఆ తర్వాతే కష్టమంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ...ఆగ్ తో పోలుస్తున్నారు. వర్మ కూడా ఆగ్ కే ఫీఛే...తీస్ మార్ ఖాన్ అని కామెంట్ చేసారు.


Click it and Unblock the Notifications











