అనుపమ, తేజు మధ్య సరదా సంభాషణ.. టార్చర్ చేశారంటున్న తేజు!
మెగా హీరో సాయిధరమ్ తేజ్, మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం జులై 6 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. వరుస పరాజయాలతో సతమతమవుతున్న తనని ఈ చిత్రం గట్టెక్కిస్తుందని తేజు భావిస్తున్నాడు. ప్రేమ కథలతో మాయ చేసే కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు.
రొమాంటిక్ ప్రేమ కథగా వస్తున్న తేజ్ ఐ లవ్ యూపై ఆటు చిత్ర వర్గాల్లో ఇటు అభిమానుల్లో మంచి బజ్ నెలకొని ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసింది. గురువారం రోజు ఈ చిత్రంలోని ప్రోమో సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో వివరించాడు.

హీరోయిన్ ని హీరో టీజింగ్ చేసే సాంగ్స్ చాలానే వచ్చాయి. అలాంటి సాంగ్స్ లో నేను కూడా నటించా. కానీ అనుపమ నన్ను టీజింగ్ చేస్తే ఎలా ఉంటుందో రేపు చూడండి అంటూ ట్వీట్ చేశాడు.
దీనికి అనుపమ సరదాగా స్పందించింది. నేను మంచి అమ్మాయిని.. అలా చేయను అని రిప్లై ఇచ్చింది. తేజు కూడా బదులిచ్చాడు నిజమే మీరు టీజ్ చేయలేదు.. టార్చర్ చేశారు అని తేజు బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications











