తేజ్ ఐ లవ్ యు.. హిట్టు పక్కా, అవుట్ పుట్ చూస్తే..!

పరాజయాల్లో ఉన్న సాయిధరమ్ తేజ్ కు వెంటనే ఓ హిట్టు కావాలి. లేకుంటే కెరీర్ పరంగా మరింతగా డీలా పడే అవకాశం ఉంది. ఇటీవల తేజు నుంచి వచ్చిన చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. తేజు ప్రస్తుతం తేజ్ ఐ లవ్ యు చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరుణాకరన్ తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల చిత్ర యూనిట్ ప్యారిస్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకుని వచ్చింది. చిత్ర అవుట్ పుట్ చూసి యూనిట్ మొత్తం సూపర్ హ్యాపీ గా ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజగా చిత్ర యూనిట్ తెలియజేసిన సమాచారం ప్రకారం ఈనెల 18 కి షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది.

 Tej I Love You movie shoot near completion

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ సరసన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. కరుణాకరన్ మార్క్ ప్రేమకథల తరహాలోనే ఈ చిత్రం కూడా ఉండబోతోందట. తేజు ఈ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X