twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తేజ్ ఐ లవ్ యూ' ప్రీ రిలీజ్ బిజినెస్.. సాయిధరమ్ తేజ్ టార్గెట్ సో సింపుల్!

    |

    సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తేజు ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం కంప్లీట్ పాజిటివ్ బజ్ తో విడుదల కానుండడం చిత్ర యూనిట్ కు శుభ పరిణామం.

    తేజ్ ఐ లవ్ యూ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తికరంగా మారింది. అన్ని ఏరియాలలో ఈ చిత్రాన్ని రీజనబుల్ ధరకే అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 13 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక, ఓవర్సీస్ రైట్స్ అన్ని కలుపుకుంటే థియేట్రికల్ బిజినెస్ మొత్తం 16 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.

     Tej I Love You pre release business

    'తేజ్ ఐ లవ్ యూ' చిత్రాన్ని సుమారు 17 కోట్ల బడ్జెట్ లో రూపొందించారు. శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ హక్కులు మొత్తం కలుపుకుంటే నిర్మాతకు 5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కినట్లు తెలుస్తోంది. రీజనబుల్ ధరకే థియేట్రికల్ బిజినెస్ జరిగింది కనుక హిట్ టాక్ వస్తే బయ్యర్లకు మంచి లాభాలు దక్కడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా పోటీ కూడా లేదు. అంతా కరుణాకరన్ చేయబోయే మ్యాజిక్ పైనే ఆధారపడి ఉంటుంది. సాయిధరమ్ తేజ్ సరసన అనుపమ హీరోయిన్ గా నటించింది.

    English summary
    Tej I Love You pre release business. Tej I Love You wil going to hit the silver screen on July 6th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X