twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజ్ ఐ ల‌వ్ యు ప్యూర్ ల‌వ్ స్టోరీ': సాయిధ‌ర‌మ్‌తేజ

    By Bojja Kumar
    |

    సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌కు సిద్ధమైంది.

    ఈ సంద‌ర్భంగా భీమ‌వ‌రం విష్ణు కాలేజ్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌న్‌, రైట‌ర్ డార్లింగ్ స్వామి, నిర్మాత వ‌ల్ల‌భ‌, జోష్ ర‌వి, గోసాల రాంబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

    తేజ్ ఐ లవ్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్

    Tej I Love You Pre Release event

    సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ మాట్లాడుతూ... తేజ్ ఐ ల‌వ్ యు ప్యూర్ ల‌వ్ స్టోరీ. ప్యామిలీ ఎమోష‌న్స్ సినిమాలో కొంత పార్ట్ ఉంటుంది. ల‌వ్ లీ ఫిలిమ్‌, ఫ‌న్ రైడింగ్‌, ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమాని త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. నాకు ముగ్గురు మావ‌య్యల క‌ష్ట‌మే నేను ఈ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాను అని వ్యాఖ్యానించారు.

    సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

    English summary
    Tej I Love You Movie Pre Release Event at Sri Vishnu College, Bhimavaram. Sai Dharam Tej, A Karunakaran, Darling Swamy, Rambabu, Josh Ravi, Bapi Raju, Raghurama Krishnam Raju, Venkata Siva Rama Raju, Mutyala Ratnam at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X