తేజ్ ఫస్ట్ ఫీల్.. అదిరిపోయిన రొమాంటిక్ పోస్టర్, టైం ఫిక్స్ చేసిన తేజు!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తేజ్ ఐ లవ్ యు చిత్రంలో నటిస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తనని విజయాల బాట పట్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రం పూర్తి కరుణాకరన్ మార్క్ తో తెరకెక్కుతోందనే విషయం అర్థమైపోయింది. రొమాంటిక్ ప్రేమ కథలతో మ్యాజిక్ చేయడంతో కరుణాకరన్ స్పెషలిస్ట్. ఈ చిత్రంలో తేజుకు జోడిగా మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ లో వీరిద్దరి రొమాంటిక్ లుక్స్ అభిమానులని తెగ ఆకట్టుకున్నాయి.

Tej I Love You teaser will release tomorrow

తాజాగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో మరో పోస్టర్ ని పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ కూడా అదిరిపోయేలా ఉంది. మంగళవారం ఉందయం 11:30 గంటలకు ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సాయిధరమ్ తేజ్ ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తేజ్ ఫస్ట్ ఫీల్ పేరుతో టీజర్ విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X